Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఉగ్రకుట్రలో షాకింగ్ ట్విస్ట్
By: Tupaki Desk | 13 Oct 2022 8:28 AM GMTహైదరాబాద్ లో దసరా, వినాయకచవితికి బాంబు పేలుళ్లకు యత్నించిన ఉగ్రవాదులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నాలుగురోజులుగా నిందితులు జాహిద్, సమీయుద్ధీన్, హసన్ ను విచారించారు. హైదరాబాద్ లో ఉగ్ర కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఉగ్ర కుట్ర కేసులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కస్టడీ కోరుతూ పిటీషన్ వేశారు. కోర్టు ఈనెల 17వరకూ అనుమతి ఇచ్చింది.
జాహిద్ కు చేరిన రూ.30 లక్షల నగదు, హ్యాండ్ గ్రెనేడ్స్ పై పోలీసులు విచారిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి మహారాష్ట్ర మీదుగా హైదరాబాద్ కు ఈ బాంబులు వచ్చినట్టు గుర్తించారు. పాకిస్తాన్ ఉగ్రవాది ఫర్హతుల్లా గౌరీ నెట్ వర్క్ లో వీరు పనిచేస్తున్నారా? ఈ నెట్ వర్క్ ట్రేసింగ్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఎంతమందిని ఉగ్రవాదంవైపు మళ్లించారు? కొత్తగా ఉగ్రవాద రిక్రూట్ మెంట్, నెట్ వర్క్, హవాలాపైసిట్ దర్యాప్తు చేస్తోంది.
జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు వెలుగులోకి తెచ్చారు. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలను ఫరాతుల్లా పంపినట్టు అధికారులు గుర్తించారు. గతనెల 28న జాహెద్ కు పేలుడు పదార్థాలు అందాయి.
బైక్ పై 4 గ్రేనేడ్లు జాహెద్ తీసుకొచ్చినట్టు విచారణలో తేలింది. 3 గ్రేనెడ్లు షమీ, మాజాకు అందించాడు జాహెద్. షమీ సెల్ ఫోన్ తో ఫరాతుల్లాతో జాహెద్ చాటింగ్ చేశారు. పాకిస్తాన్ లోని హ్యాండర్లతో ఉగ్రకార్యకలాపాలకు స్కెచ్ చేశారు.
హైదరాబాద్ లో సామూహిక ఉత్సవాల్లో దాడులు చేసి భారీగా ప్రాణనష్టం చేయాలని నిందితులు ప్రణాళిక వేసినట్టు అధికారులు రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. అంతేకాకుండా డబ్బుతో యువకులకు ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేసినట్టు గుర్తించారు. పాకిస్తాన్ లోనే హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ నడిచినట్టు తేలింది.
పేలుళ్ల కోసం మూసారంబాగ్ కు చెందిన అబ్దుల్ జాహెద్ ను ఎంపిక చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, పండుగలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు సిద్ధమైనట్లు తేలింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి తీగ లాగితే ఈ డొంకంతా పాకిస్తాన్ నుంచి కదులుతోంది. వీరి కుట్రలు బయటపడుతున్నాయి. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.