Begin typing your search above and press return to search.

దిశ కేసు లో వెలుగులోకి సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   11 Dec 2019 5:55 AM GMT
దిశ కేసు లో వెలుగులోకి సంచలన నిజాలు
X
హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తం గా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసు హైకోర్టు, సుప్రీం కోర్టు, మానవ హక్కుల సంఘాల మధ్య విచారణ సాగుతోంది.

దీంతో ప్రభుత్వం కూడా దిశ ఎన్ కౌంటర్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయిస్తోంది. ఎన్ కౌంటర్ సందర్భంగా నిందితుల శరీరం లోకి బుల్లెట్లు దూసుకెళ్లి మరణించారు. పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం ఆరీఫ్ శరీరంలో నాలుగు, శివ, చెన్నకేశవులు శరీరంలోకి మూడు, నవీన్ శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకు పోయాయని తెలిపారు.

అయితే తాజాగా వైద్యులు ఈ నాలుగు మృతదేహాలకు చేసిన పోస్టుమార్టం లో అసలు వారి శరీరాల్లో బుల్లెట్లు లభించలేదని తెలిసింది. బుల్లెట్లు అన్ని నిందితుల శరీరాల నుంచి చొచ్చుకొని వెళ్లి బయటకు వెళ్లినట్లు వైద్యులు పోస్టుమార్టం రిపోర్టు లో వెళ్లడించారట..

మొత్తం 10 మంది పోలీసులు ఈ ఎన్ కౌంటర్ లో పాలు పంచుకున్నారు. ఇందులో ఇద్దరు పోలీసులకు గాయలయ్యాయి. అంటే 8 మంది నిందితులను కాల్చారు. వారిలో ఎవరు ఎవరిని కాల్చారన్నది తేల్చడం ఇప్పుడు కష్టంగా మారింది. బుల్లెట్ షెల్ ఆధారంగా గుర్తించడానికి ఆస్కారం లేకుండా పోయింది.

దీంతో హంతకులను హతమార్చిన పోలీసుల పై కేసులు వేయడం కోర్టు కు ఇతర వర్గాలకు కూడా కష్టతరంగా మారనుంది. ఘటన స్థలంలో బుల్లెట్స్, వాటి షెల్స్ ద్వారానే విశ్లేషణ సాగుతోంది.