Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   23 Nov 2021 9:30 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు
X
వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో సంచలన నిజం బయటకు వచ్చింది. వైఎస్ వివేకా హత్యలో అల్లుడి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి కోణం వైపు కేసు టర్న్ తీసుకుందని తెలుస్తోంది.

ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టుకున్న వైఎస్ వివేకాను చంపితే మొత్తం తనే ఓనర్ ను అవుతానని భావించారా? కానీ రాసిస్తే సొంతమవుతుంది. కానీ చంపేస్తే శిక్ష పడుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పుడు ఆస్తి కోణం కలకలం రేపుతోంది.

వైఎస్ వివేకాను ఆస్తి కోసం అయినవాళ్లే హత్య చేశారంటూ ఆరోపనలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత? హత్య వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటి? అసలు ఎవరు చంపారన్నది మాత్రం తేలడం లేదు.

వైఎస్ వివేకా హత్య కేసులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ను తలపిస్తోంది సీబీఐ విచారణ. రోజుకో పేరు తెరపైకి వస్తుంది. అరెస్ట్ లు సహా ఆరోపణల పర్వం జోరందుకుంది. తెరవెనుక ఏం జరుగుతుందో కానీ తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో అల్లుడి పాత్రపైన ఉత్కంఠ నెలకొంది. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి టార్గెట్ గా భరత్ యాదవ్ అనే వ్యక్తి ఆరోపణలు సంచలనంగా మారాయి.

మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వాచ్ మెన్ రంగయ్య సహా ఎందరినో విచారించింది.ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ వివేకా కూతురు సునీతా రాజశేఖర్ రెడ్డి కేంద్రంగా సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తాజాగా సీబీఐకి రాసిన లేఖ ప్లస్ భరత్ యాదవ్ సంచలన ఆరోపణలు కడప జిల్లాలో సంచలనంగా మారాయి.

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. శంకర్ రెడ్డి ఐదో వ్యక్తిగా ఉన్నారు. వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో దర్యాప్తును వేగం చేసింది. ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరిలను అరెస్టు చేయగా వారు బెయిల్ పై బయటికొచ్చారు. అలాగే సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలను అరెస్టు చేయగా వారు జైలులో ఉన్నారు. తాజాగా శంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ తాజాగా భరత్ యాదవ్ పేరును తీశాడు. ఈ భరత్ యాదవ్ వివేకా హత్యలో కీలక సూత్రధారి సునీత భర్త రాజశేఖర రెడ్డినేంటూ బాంబు పేల్చాడు. వివేకా హత్య చేయించింది.. నిందితులకు డబ్బులు ఇచ్చింది సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇది ఒక ఆస్తి తగాదా అని.. వైఎస్ వివేకా సన్నిహితురాలు షమీమ్ కు మామ గారి ఆస్తి మొత్తం వెళుతుందనే కోణంలోనే ఈ హత్య జరిగిందని భరత్ యాదవ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ నేరుగా తనతో ఈ హత్య వివరాలు వెల్లడించినట్టు భరత్ యాదవ్ చెబుతున్నాడు. ప్రాణభయంతోనే తాను ఈ విషయం చెప్పలేదన్నారు