Begin typing your search above and press return to search.

రఘురామ విషయంలో 50 కోట్లు చేతులు మారాయట?

By:  Tupaki Desk   |   24 May 2021 3:30 PM GMT
రఘురామ విషయంలో 50 కోట్లు చేతులు మారాయట?
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో జనాలకు తెలియాల్సి చాలా ఉందని ప్రముఖ జర్నలిస్ట్ కనుమూరి రవిచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎల్లో మీడియా అతడిని చాలా వాడుకుందని.. స్లాట్ లు బుక్ చేసి మరీ వారు వాడుకున్నారని తెలిపారు. రఘురామకు ఉన్న ప్రచార యావను ఆసరాగా తీసుకొని సదురు చానెల్స్ 'దూకుడు' సినిమాలో బ్రహ్మానందంను వాడినట్టు వాడుకున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక కరివేపాకు నాయుడు ఉన్నారని.. ఆయనే ఎల్లో మీడియాల చేత ఈయనను వాడుకునేలా చేసి ఈ దుస్థితి పట్టించాడని రవిచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహం కేసులు పెట్టేంత తీవ్రంగా ఆయనను వాడేశారని ఆరోపించారు.

కరివేపాకు నాయుడు, ఆయన గ్యాంగ్ రఘురామను వాడుకొని ఆయన వద్ద రూ.50 కోట్లు మేసేసారని రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రతి సంక్షోభానని కరివేపాకు నాయుడు వాడుకున్నాడని.. రూ.50 కోట్లను రఘురామ నుంచి వాడేశారని చెప్పారు. ఇందులో నిజానిజాలు వారికే తెలియాలని చెప్పుకొచ్చారు.

కరివేపాకు నాయుడును నమ్మినవారు నిండా మునిగారని.. కొందరు కాశీకి పోయారని.. మరికొందరు ఆస్తులు పోగొట్టుకొని.. జైలుకు పోయి అష్టకష్టాలు పడ్డారని.. ఇప్పుడు రఘురామ పరిస్థితి కూడా అలానే అయ్యిందని రవిచంద్రారెడ్డి ఆరోపించారు. రఘురామ తనదే హీరో అనుకున్నాడని.. కానీ కరివేపాకు నాయుడు ఈ రేంజ్ లో వాడేసి ఆయనను పీల్చి పిప్పిజేశాడని ఆరోపించారు. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నా.. కొందరు దగ్గరి వారి నుంచి ఈ విషయాలు తెలిసాయని ఆయన తెలిపారు.