Begin typing your search above and press return to search.
ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో హైకోర్టు సంచలన తీర్పు
By: Tupaki Desk | 17 March 2022 5:30 PM GMTఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా దానిని అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించింది. ఇది పెనట్రేటివ్ సెక్స్ కిందికి వస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ నేతృత్వంలోని డివిజినల్ బెంచ్ పేర్కొంది. మహిళ జననాంగంలోకి ఏదైనా చొప్పించడం కూడా అత్యాచారం కిందకు వస్తుందని హైకోర్టు తీర్పు వెల్లడించింది.
2006లో తనపై అత్యాచారం జరిగిందని పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే 2018లో స్థానిక కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష.. రూ.25వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తాను బాలికపై లైంగికచర్యకు పాల్పడలేదని.. లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకానని వాదించారు. ఇతడి వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.
గతంలోనూ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి.. లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది. ‘స్కిన్ టు స్కిన్ ’ కాంటాక్ట్ నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని.. కోర్టు చర్యలు తీసుకోలేదని జడ్జి పేర్కొన్నారు. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.