Begin typing your search above and press return to search.

గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   14 Jun 2022 9:31 AM GMT
గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు
X
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ పూర్తి చేశారు. ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్(18) నుంచి కీలక సమాచారం రాబట్టాడు. మిగిలిన మైనర్ నిందితులను విచారించారు. ఇప్పటికే జరిగిన మూడు రోజుల్లో పలు విషయాలు అడిగి మైనర్ నిందితుల నుంచి వివరాలను రాబట్టారు. నేరాన్ని నిందితులు ఒప్పుకున్నారు.

నాలుగోరోజైన నేడు సాదు్దీన్ ఇచ్చిన వాంగ్మూలంతో మిగిలిన ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు. సామూహిక అత్యాచారం అనంతరం పబ్ బేస్ మెంట్ లో బాలికను మళ్లీ వేధించినట్టు నిందితులు ఒప్పుకున్నారు.

పోలీసులకు లభించిన సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలున్నాయి. ఆరుగురు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాలిక తండ్రి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారు.

కాగా ఈ కేసులో సాదుద్దీన్ మినహా మిగిలిన వారంతా మైనర్లే అని.. వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.

అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)పైనే తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఒక్క వాహనమే కాదు.. హైదరాబాద్ లో వేలకొద్దీ వాహనాలు ఇలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే తిరుగుతూ గందరగోళానికి కారణమవుతున్నాయి.

జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో ముగ్గురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కు లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు పొటెన్సీ పరీక్షలు తప్పనిసరి. ఈ మేరకు పోలీసులు నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం నిందితులకు పరీక్షలు జరుపనుంది. మరోవైపు మైనర్ల పోలీస్ కస్టడీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

మరోవైపు బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక మెడికల్ రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. బాలికపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి.. ఒంటిపై 12 తీవ్రగాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. బాలిక నిరాకరించడంతో గోళ్లతో దాడి చేశారు. బాలిక ఒంటిపై 12 తీవ్రగాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వీడియోలు వైరల్ చేసిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. బాలిక వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.