Begin typing your search above and press return to search.

సంచలనం: మహా సముద్రం అడుగున రోడ్డు ఎవరు వేశారు?

By:  Tupaki Desk   |   11 May 2022 5:06 AM GMT
సంచలనం: మహా సముద్రం అడుగున రోడ్డు ఎవరు వేశారు?
X
శాస్త్రవేత్తల బృందం పసిఫిక్ మహాసముద్రం దిగువన ఒక వింత పసుపురంగులోని ఒక రహదారి మార్గాన్ని కనుగొన్నారు. హవాయి దీవులకు ఉత్తరాన ఉన్న ఆ రోడ్డు ఇటుకలతో నిర్మించినట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేయగా వైరల్ అయ్యింది.

ఎక్స్‌ప్లోరేషన్ వెస్సెల్ నాటిలస్ సిబ్బంది పసిఫిక్ మహాసముద్రంలోని యునైటెడ్ స్టేట్స్ మెరైన్ నేషనల్ మాన్యుమెంట్‌లోని లిలియూకలాని రిడ్జ్ అనే ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వింతగా కనిపించిన ఈ రహదారి నిర్మాణాన్ని చూశారు. ఒక పరిశోధకుడు ఇటుక మార్గాన్ని "అట్లాంటిస్‌కు రహదారి" అని వర్ణించడంతో ఇదిప్పుడు వైరల్ గా మారింది. ఇదొక "అద్భుతంగా" శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

మధ్య -పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాలలో ఇలాంటి రహదారులు అరుదుగా ఉంటాయని.. ఒకప్పుడు ఇది అమెరికా, యూరప్ ల మధ్య రహదారి అయ్యి ఉంటుందని.. సముద్రంలో కలిసిపోయి విడిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

వారు తమ అన్వేషణలను ప్రత్యక్షంగా డాక్యుమెంట్ చేసారు, ఇది ప్రత్యేకమైన దీర్ఘచతురస్రాకార బ్లాక్‌లతో మానవ నిర్మిత ఇటుక రహదారిని పోలి ఉంది.ఇది ఒకప్పటి 'అట్లాంటిస్ రహదారి' ఈ నిర్మాణం వాస్తవానికి "పురాతన క్రియాశీల అగ్నిపర్వత భౌగోళిక శాస్త్రానికి ఉదాహరణ" అని శాస్త్రవేత్తలు తెలిపారు.

"నూట్కా సీమౌంట్ శిఖరం వద్ద ఈ బృందం 'ఎండిన సరస్సు' ను గుర్తించింది. ఇప్పుడు ఇది ప్రవాహాలకు ధ్వంసమైన రహదారిగా గుర్తించబడింది. అధిక శక్తి విస్ఫోటనాలలో ఏర్పడిన అగ్నిపర్వత శిల, ఇక్కడ అనేక రాతి శకలాలు సముద్రగర్భంలో ఏర్పడ్డాయని తెలిపారు.

రాక్‌లోని "ప్రత్యేకమైన" పగుళ్లు దాని శంకుస్థాపన నిర్మాణాన్ని పోలిఉన్నాయి., బహుశా బహుళ అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా కాలక్రమేణా పదేపదే వేడి చేయడం.. శీతలీకరణ ఫలితంగా ఇవి ఏర్పడ్డాయని పరిశోధకులు వివరించారు. బృందం మునుపెన్నడూ ఈ ప్రాంతాన్ని సర్వే చేయలేదని, కానీ ఇప్పుడు వారు పురాతన సముద్రపు పర్వతాల రాతి వాలులలో.. లోపల జీవితాన్ని లోతుగా పరిశీలిస్తారని కూడా వారు పేర్కొన్నారు.