Begin typing your search above and press return to search.

విడాకులకు కారణం ఆ.. సమస్యే..:మాజీ సీఎం సతీమణి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Feb 2022 6:33 AM GMT
విడాకులకు కారణం ఆ.. సమస్యే..:మాజీ సీఎం సతీమణి సంచలన వ్యాఖ్యలు
X
భార్యభర్తల మధ్య గొడవలు సహజం. అయితే ఈ గొడవలు విడాకుల వరకు దారి తీస్తాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు కావచ్చు.. లేక ఒకరిపై ఒకరిని నమ్మకం సన్నగిల్లడం కావొచ్చు.. ఓ జంట విడిపోతుండడానికి ఒక్క కారణం చాలు అని ఫ్యామిలీ కోర్టుల్లో వింటుంటాం. అయితే భార్యభర్తలు విడిపోవడానికి ఇద్దరి మధ్య మాత్రమే సమస్య కాదని.. సమాజంలోని కొన్ని సమస్యల వల్ల విడాకులు తీసుకోవాల్సి వస్తోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నీవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహానగరం ముంబైలోని ట్రాఫిక్ సమస్యల వల్ల అధిక జంటలు విడిపోతున్నాయని అన్నారు. అయితే ముంబైలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిత్యం ట్రాఫిక్ రద్దీగానే ఉంటుంది. దాదాపు 24 గంటలు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ కుటుంబ సభ్యులతో గడవలేకపోతున్నారని అమృత ఫడ్నవీస్ అన్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండడంతో ఇది కుటుంబ సమస్యకు దారి తీస్తోందని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది సరైన సమయంలో తమ కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోతున్నారని అన్నారు. ముఖ్యంగా 3 శాతం విడాకులు ట్రాఫిక్ సమస్యతోనే విడాకులు తీసుకుంటున్నారని అన్నారు. ముంబైలో మహా వికాస్ అఘాఢీ నేతృత్వంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని, అయితే వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ స్పందించారు. ఇదో కొత్త రకమైన విమర్శ అన్నారు. ఇలాంటి వాదనను వినడం ఇదే మొదటిసారి అని ప్రతివిమర్శ చేశారు. ట్రాఫిక్ సమస్య కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వాదన కరెక్ట్ కాదన్నారు. చాలా మంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కానీ ఒక ప్రముఖ వ్యక్తి ట్రాఫిక్ కారణమని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా త్వరలో బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేటసణ్ ఎన్నికలు సమీపిస్తుండగా ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు.

కాగా విడాకులకు ట్రాఫిక్ సమస్యే కారణమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వ్యాఖ్యలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముంబైలో 3 శాతం విడాకులు అని చెప్పిన అమృత బెంగుళూరు, పూణె, ఢిల్లీ వంటి నగరాల్లో ఎంతశాతం విడాకులు తీసుకుంటున్నారో చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ‘ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే‘ అని పేర్కొన్నారు.