Begin typing your search above and press return to search.

వివేకా హత్యపై సీబీఐ వెల్లడించిన సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   7 Nov 2021 5:30 AM GMT
వివేకా హత్యపై సీబీఐ వెల్లడించిన సంచలన విషయాలు
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. సౌమ్యుడిగా పేరున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అనుమానాలు.. విమర్శలు.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకా హత్యకు సంబంధించి తాజాగా కోర్టుకు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో పలు సంచలన అంశాల్ని వెల్లడించింది.

వైఎస్ వివేకా హత్య జరిగిన వేళలో.. ఆయన ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమేరాలో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాల్ని సీబీఐ వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల వేళలో.. గజ్జల రోడ్డు మీద పరుగెత్తుకు వెళ్లటం వైఎస్ వివేకా ఇంటికి దగ్గర్లోని షాపు వద్ద ఉన్న సీసీ కెమేరాలో రికార్డు అయినట్లుగా పేర్కొన్నారు.

తాజాగా గజ్జల బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ షాకింగ్ నిజాల్ని వెల్లడించింది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి.. యాదాటి సునీల్ యాదవ్.. గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. షేక్ దస్తగిరి పాత్ర ఉన్నట్లుగా అక్టోబరు 27న సీబీఐ ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో గజ్జలకు బెయిల్ ఇవ్వటం సరికాదంటూ.. బెయిల్ పిటిషన్ ను కొట్టి పారేసింది. వివేకా హత్య వేళ రోడ్డు మీద గజ్జల పరుగెత్తిన తీరును.. విడి సమయాల్లో అతడు పరిగెత్తే తీరును పరిశీలించారు. మొత్తంగా సంచలన అంశాల్ని బయటకు వచ్చిన వేళ.. రానున్న రోజుల్లో వైఎస్ వివేకా హత్య ఉదంతంలో మరెన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయో చూడాలి.