Begin typing your search above and press return to search.
సీఎం పవర్ స్టార్.. సీఎం పవర్ స్టార్
By: Tupaki Desk | 28 Aug 2016 7:23 AM GMTతమ అభిమాన హీరోలు రాజకీయాల్లోకి రావడం ఆలస్యం.. ముఖ్యమంత్రులైపోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. నిన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ సందర్భంగా ‘సీఎం’ నినాదాలు గట్టిగానే వినిపించాయి. సీఎం పవర్ స్టార్.. సీఎం పవర్ స్టార్ అంటూ వాళ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం విశేషం. ఐతే ఈ నినాదాల్ని పవన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అలాగే ‘జై పవనిజం’ అనే నినాదాలు కూడా జోరుగానే వినిపించాయి ఈ సభలో. తనకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని.. అందుకోసం రాజకీయాలు చేయట్లేదని పవన్ ఓవైపు స్టేజ్ మీద నొక్కి వక్కాణిస్తుంటే అభిమానులేమో తమ హీరోను ఏకంగా ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు.
ఇక తిరుపతి సభ కోసం చాలా తక్కువ వ్యవధిలో జనసేన పార్టీ ఏర్పాట్లు చేసి.. ఏ ఆటంకాలూ లేకుండా సభను నిర్వహించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. పెద్ద మైదానం ఎంచుకుని ఉంటే.. భద్రత ఏర్పాట్లు కష్టమయ్యేది. అందుకే పది వేల మంది మాత్రమే పట్టే చిన్న మైదానాన్ని ఎంచుకుని మంచి పని చేశారు. సభకు అనుమతించింది ఆరు వేల మందినే. మిగతా వాళ్లందరూ మైదానం చుట్టూ గుమిగూడారు. మైదానం వెలుపల ఎల్ ఈడీ స్కీన్ల దగ్గరా జనాలు పెద్ద ఎత్తున మూగారు. పరిసర ప్రాంతాల్లోని జనాలు మిద్దెలు.. మేడలు ఎక్కి.. సమీపంలోని చెట్లమీదికి చేరుకుని పవన్ ప్రసంగాన్ని వీక్షించారు. పవన్ వేదికపైకి వచ్చిన సమయంలో అభిమానులు బారికేడ్లు విరగ్గొట్టుకుని దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు స్వల్పంగా పని చెప్పాల్సి వచ్చింది. అది మినహాయిస్తే ఏ అపశ్రుతీ చోటు చేసుకోలేదు.