Begin typing your search above and press return to search.
సంచలనంగా సుబ్రమణ్య స్వామి యూట్యూబ్ వీడియో.. ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 1 Oct 2021 4:54 AM GMTసంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాజకీయాల్ని ఆయన పెద్దగా పట్టించుకున్నది లేదు. అందుకు భిన్నంగా అనూహ్యంగా ఆయన టీటీడీకి చెందిన కేసును టేకప్ చేయటం.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించిన ఎపిసోడ్ వేళ.. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలతో కూడిన యూ ట్యూబ్ వీడియోను ఆంధ్రజ్యోతి బయటకు తీసుకొచ్చింది.
టీటీడీ తరఫున వాదించేందుకు సిద్ధమై.. రూ.వంద కోట్ల పరువు నష్టం దావాను వేసిన ఆయన.. ఆంధ్రజ్యోతికి సంబంధించి కీలక వ్యాఖ్యల్ని ఆయన సదరు యూ ట్యూబ్ వీడియోలో వెల్లడించటం విశేషం. అసలీ వివాదం ఎక్కడ మొదలైందంటే.. 2019లో టీటీడీ పంచాంగం కోసం వెబ్ సైట్ ను వెతికితే.. అన్యమత పదం ప్రత్యక్షమైంది. తప్పు జరిగింది.. అది కూడా ఎవరో చేశారు. సరిదిద్ది.. తగిన చర్యలు తీసుకోండంటూ కథనాన్ని అచ్చేసినట్లుగా చేశామన్నది ఆంధ్రజ్యోతి వాదన.
ఈ కథనం పెను సంచలనంగా మారటం.. టీటీడీకి ఇబ్బందికరంగా తయారైంది. ఇదిలా ఉంటే.. ఉద్దేశ పూర్వకంగా టీటీడీ ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో భాగంగా ఆంధ్రజ్యోతి వ్యవహరించిందన్నఆరోపణతో.. సదరు మీడియా సంస్థపై రూ.వంద కోట్లకు పరువు నష్టం కేసువేశారు. ఇలాంటివేళ.. అనూహ్యంగా తెర మీదకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. తాను వేంకటేశ్వరస్వామి భక్తుడినని.. తన తల్లి స్వామి వారిని ప్రార్థించటం వల్లే తాను పుట్టినట్లుగా.. ఆ భక్తి భావంతోనే టీటీడీకి మద్దతుగా ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తున్నట్లుగా తిరుపతి మీడియాతో చెప్పారు.
అంతటి స్వామి.. తిరుపతికి ప్రత్యేక విమానంలో వచ్చారే తప్పించి.. తనకెంతో ప్రీతిపాత్రమైన స్వామి వారిని దర్శించుకోలేదు. ఇదిలా ఉంటే.. టీటీడీ పెట్టిన కేసులో పోలీసులు వేగంగా విచారణ జరపలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణ్య స్వామికి బదులుగా.. తమ పని తాము పూర్తి చేశామని.. చార్జిషీటును కూడా దాఖలు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. దీంతో.. ఈ పిటిషన్ పై హైకోర్టు తన తదుపరి ఆదేశాల్ని జారీ చేసింది. అయితే.. తాను విజయం సాధించినట్లుగా స్వామి పేర్కొన్నారు.
ఇదే అంశం మీద పి.గూరూస్ అనే యూట్యూబ్ చానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 36 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో 18 నిమిషాలకు పైనే తమ గురించి స్వామి మాట్లాడినట్లుగా ఆంధ్రజ్యోతి చెబుతూ.. ఆయన నోటి నుంచి వచ్చిన పలు విషయాల్ని వెల్లడించింది. దీని ద్వారా.. ఈ కేసు వేయటం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. అదే విషయాన్ని స్వామి తన మాటల్లోనే చెప్పారని స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఏమేం ప్రస్తావించింది? ఏ వాదనను వినిపించిందన్నది వారి మాటల్లోనే చూస్తే..
- ‘‘జగన్ రెడ్డికి నేను తెలుసు. ఆయన తండ్రికి కూడా బాగా తెలుసు. దయచేసి మమ్మల్ని కాపాడండి... అని జగన్ ఒక మెసేజ్ పంపించారు. కచ్చితంగా ఇవే పదాలు కాదు కానీ, మనం కంట్రోల్ చేయగలమా? మీరేమైనా చేయగలరా? అని అడిగారు’’ అని స్వయంగా సుబ్రమణ్య స్వామే ఆ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
- అంటే... ఆయన అంతకుముందు తిరుపతిలో చెప్పినట్లుగా, వెంకన్న భక్తుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదన్న మాట! ‘సేవ్ చేయగలరా! ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయగలమా!’ అని జగన్ అడిగిన మీదటే రంగంలోకి దిగారన్న మాట!
- టీటీడీ వేసిన కేసులోనే తాను ఇంప్లీడ్ అవుతున్నానని, దేవస్థానం నుంచి ఒక్కపైసా కూడా తీసుకోబోనని స్వామి అంతకుముందు చెప్పారు. కానీ... బుధవారంనాటి ఇంటర్వ్యూలో మాత్రం ‘లాభాల’ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఈ కేసు నేను గెలిచినట్లే’ అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు.
- తిరుపతి కోర్టులో విచారణ ఇంకా మొదలుకాకముందే, సుబ్రమణ్యస్వామి సొంతంగా తీర్పు చెప్పేసి, వాటాలు కూడా పంచేయడం విశేషం. ఒకవేళ టీటీడీ కేసు గెలిస్తే... సుబ్రమణ్యస్వామికి వంద కోట్లు ఎలా వస్తాయి? ఏ రూపంలో వస్తాయి? ఆ సంగతి మాత్రం చెప్పలేదు. అయితే... ‘పైసా కూడా తీసుకోను’ అని అంతకుముందు తిరుపతిలో చెప్పిన మాటలకు ఇది పూర్తి భిన్నం కావడం విశేషం.
- ఈ కేసులో తాను ప్రయాణ ఖర్చులను కూడా తీసుకోబోనని సుబ్రమణ్య స్వామి మీడియాతో చెప్పారు. ఇక్కడే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందరికీ తెలిసి... స్వామికి పెద్ద పెద్ద వ్యాపారాలేవీ లేవు. ఒక సాధారణ ఎంపీ. కానీ... ‘ఆంధ్రజ్యోతి’పై కేసు వేసేందుకు నేరుగా ఢిల్లీ నుంచి తిరుపతికి స్పెషల్ ఫ్లైటులో వచ్చారు. ఆ ఖర్చు ఆయనే భరించారా? టీటీడీ భరించిందా? ఇంకెవరైనా భరించారా? తెలియదు.
- ఇది ఒకటో సారి! ఇక రెండోసారి... సుబ్రమణ్యస్వామి ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చారు. తొలుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో, ఆ తర్వాత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ స్పెషల్ ఫ్లైట్‌కు ఖర్చులు ఎవరు భరించారో, ఎందుకు భరించారో కూడా తెలియదు!
- ఈ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూ కామెంట్స్ సెక్షన్‌లో చాలామంది వీక్షకులు సుబ్రమణ్య స్వామికి చురకలు అంటించారు. అందులో.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల కూల్చివేత, హిందూమతాన్ని నాశనం చేయడం, క్రిస్టియానిటీని పెంచేయడం వంటి విషయాలు హిందూ భక్తుడైన స్వామికి తెలియవా? దాన్నెందుకు ప్రశ్నించడం లేదు’’ అన్న వ్యాఖ్యతో పాటు.. ‘‘మరోసారి స్వామి రాజ్యసభకు వెళ్లడం ఖాయం! అయితే, ఈసారి బీజేపీ నుంచి కాదు. వైసీపీ తరఫు నుంచి’’ అని ఆంధ్రజ్యోతి పేర్కొనటం గమనార్హం.