Begin typing your search above and press return to search.
నిర్మలమ్మ ఎఫెక్ట్?: 600 పాయింట్లు ఆవిరి
By: Tupaki Desk | 8 July 2019 7:53 AM GMTకేంద్ర ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. తిరుగులేని మెజార్టీతో రెండోసారి కేంద్రంలో కొలువు తీరిన మోడీ.. తన మొదటి బడ్జెట్ లో భారీ తాయిలాలు ప్రకటించటం ద్వారా ఓట్లేసిన ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతారని భావించారు. అయితే.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది బడ్జెట్ అంచనాలు.
బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టటానికి ముందు మార్కెట్ సానుకూలంగా స్పందించటమే కాదు.. అంతకంతకూ పెరగటం శుభసంకేతంగా భావించారు. అయితే.. మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయన్న భావనతో మార్కెట్ తగ్గింది. పెద్ద ఎత్తున పాయింట్లు కోల్పోయాయి. సాధారణంగా ఏ బడ్జెట్ తర్వాత అయినా కొంతకాలం ఈ తరహా ఆటుపోట్లు మామూలే అన్న మాట వినిపించింది.
అయితే.. అనుకున్న దాని కంటే దారుణమైన పరిస్థితి ఉందన్న విషయం ఈ రోజు (సోమవారం) మార్కెట్లు ప్రారంభం కాగానే విషయం అర్థమైంది. అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో భారీ నష్టాలు మార్కెట్లో నమోదవుతున్నాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవటం.. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనమయ్యేలా చేశాయి.
దీంతోఈ రోజు ట్రేడింగ్ ప్రారంభం కాగానే మార్కెట్లు డౌన్ అయ్యాయి. అంతకంతకూ పాయింట్లు నష్టపోయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఏకంగా 400 పాయింట్లతో సెన్సెక్స్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఇది అంతకంతకూ పెరుగుతూ కొద్దిసేపటి క్రితం 600 పాయింట్ల వరకు నష్టపోయిన పరిస్థితి. డిసెంబరు 2018 తర్వాత ఇంత భారీగా సూచీలు నష్టపోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న నష్టాల కారణంగా మార్కెట్ షేర్ల విలువ భారీగా పడిపోయిన పరిస్థితి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. సెంటిమెంట్ త్వరగా బలపడే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా నిర్మలమ్మ బడ్జెట్ పుణ్యమా అని.. దగ్గర దగ్గర వెయ్యి పాయింట్ల వరకూ ఆవిరైనట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరెంత కాలం ఉంటుందన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది.