Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ గురించి సంచలన విషయాల్ని వెల్లడించిన ప్రముఖుడు

By:  Tupaki Desk   |   17 Jan 2022 11:45 AM GMT
ఒమిక్రాన్ గురించి సంచలన విషయాల్ని వెల్లడించిన ప్రముఖుడు
X
ప్రపంచానికి ఇప్పుడు వేధిస్తున్న కొవిడ్ మహమ్మారికి సంబంధించిన సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ కొత్త వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కు సంబంధించిన కీలక విషయాల్ని వెల్లడించారు ప్రఖ్యాత వైరాలజిస్టు టి. జాకోబ్ జాన్. ప్రస్తుతం నడుస్తున్న కరోనా మూడో వేవ్ లో.. కొవిడ్ వేరు.. ఒమిక్రాన్ వేరన్నది ఆయన సూత్రీకరణ. డెల్టాను.. ఒమిక్రాన్ ను వేర్వేరుగా చూడాలని ఆయన చెబుతున్నారు.

డెల్టా వేరియంట్.. ఒమిక్రాన్ రెండూ వేర్వేరుగా ఆయన చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ రెండింటికి సంబంధించి కలుగుతున్న వ్యాధులు వేర్వేరుగా ఉన్నాయని.. అందుకే వీటిని వేర్వేరుగా చూడాలంటున్నారు. ఆయన వాదన ప్రకారం.. ప్రస్తుతం రెండు రకాల మహమ్మారులు కొనసాగుతున్నట్లుగా చెబుతున్నారు.

డెల్టా వేరియంట్ తో నియోనియా.. హైపాక్సియా.. బహుళ అవయువాలు దెబ్బ తినే వ్యాధి తలెత్తుతోందని.. ఒమిక్రాన్ మాత్రం ఎగువ.. మధ్య శ్వాసకోశ రుగ్మత వస్తుందని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఏ రకం నుంచి పుట్టుకువచ్చిందన్నది ఇప్పటికి అంతుచిక్కనిదిగా మారిందని చెబుతున్నాయి. అయితే.. ఒమిక్రాన్ ముత్తాత మాత్రం వూహాన్ డి614జి వేరియంట్ అని మాత్రం చెప్పగలనని చెబుతున్నారు.

డి614జి అనేది వైరస్ ప్రోటీన్ లోని అమినో ఆమ్లంలో జరిగిన ఉత్పరివర్తన అని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ లో ఇది జనరల్ గా కనిపిస్తోందన్నారు. అయితే.. వూహాన్ వేరియంట్ తో పాటు.. అల్ఫా.. బీటా.. గామా.. డెల్టా.. కప్పా.. మ్యూ వంటి వేరియంట్లో ఏదీ లేదని మాత్రం చెప్పగలనని చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల లేకపోవటం చూస్తే.. మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరినట్లుగా భావించొచ్చా? అని ప్రశ్నిస్తే మాత్రం.. తొలుత నగరాల్లో తీవ్రత మొదలైంది కాబట్టి.. మొదటే ముగుస్తుందని చెప్పారు. మొత్తంగా ఒమిక్రాన్ కు.. డెల్టాకు మధ్య పోలిక లేదని.. రెండు వేర్వేరు అన్న కొత్త వాదననుఆయన తెర మీదకు తెచ్చారని చెప్పాలి.