Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి పేరు అన్ని అన‌ర్థాల‌కు కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   27 July 2015 12:35 PM GMT
అమ‌రావ‌తి పేరు అన్ని అన‌ర్థాల‌కు కార‌ణ‌మా?
X
న‌మ్మ‌కాల‌కు చింత‌కాయ‌లు రాల‌తాయో లేదో కానీ..రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం త‌మ న‌మ్మ‌కాల‌తో ఎడ‌పెడా నిర్ణ‌యాలు తీసేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ భ‌వ‌నాన్ని కూల్చేస్తారో..? ఎప్పుడు ఏ భ‌వ‌నంపై దృష్టి సారిస్తారో అర్థం కాని ప‌రిస్థితి. అంతేకాదు.. పేర్ల‌ను పెట్ట‌టం.. వాటిని మార్చేయ‌టం కూడా అంతా న‌మ్మ‌కాల మీద‌నే న‌డిచిపోతోంది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి అని చెప్పిన ఏపీ ముఖ్య‌మంత్రి తాజాగా.. అమ‌రావ‌తి.. విజ‌య‌వాడ జంట న‌గ‌రాల‌ని పేర్కొన‌టం తెలిసిందే. ఇంత‌కాలం లేనిది.. అమ‌రావ‌తి ప‌క్క‌న విజ‌య‌వాడ రావ‌టం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే.. దీని వెనుక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంద‌ని చెబుతున్నారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి పేరు పెట్ట‌టంతో విజ‌య‌వాడ ప్రాధాన్యం త‌గ్గింద‌ని.. ఇది బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ప్రాధాన్యం త‌గ్గించిన‌ట్లు అయ్యింద‌ని.. దాని కార‌ణంగానే ఈ మ‌ధ్య కాలంలో ఏపీలో చోటుచేసుకున్న అన‌ర్థాలుగా ముఖ్య‌మంత్రి న‌మ్మే జ్యోతిష్యులు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

వారి సూచ‌న మేర‌కు అమ‌రావ‌తి పేరు ప‌క్క‌న విజ‌య‌వాడ కూడా చేరిస్తే బాగుండ‌టంతో పాటు.. మంచి జ‌రుగుతుంద‌ని సూచ‌న చేయ‌టంతో.. వారి వాద‌న‌తో ఏపీ ముఖ్య‌మంత్రి ఏకీభ‌వించి.. ఈ జంట న‌గ‌రాల ప్ర‌స్తావ‌న తెర మీద‌కు తీసుకొచ్చిన‌ట్లు చెబుతున్నారు.