Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకో అంటే.. ఆ మోడల్ ఘనకార్యమిది!
By: Tupaki Desk | 4 April 2018 5:24 AM GMTప్రేమించినంత ఈజీగా పెళ్లిళ్లు కావు. ప్రేమలో పడేందుకు కారణాలు పెద్దగా అక్కర్లేదు కానీ పెళ్లి వరకూ వచ్చేసరికి మాత్రం లెక్కలు చాలానే ఉంటాయి. ఈ విషయంలో క్లారిటీ మిస్ అయితే ఆపదల్ని కోరి తెచ్చుకున్నట్లే. కలిసి ఉండటానికి.. సహజీవనం చేయటానికి ఓకే అనేసే కుర్రాడు.. అదే అమ్మాయితో పెళ్లికి మాత్రం తెగ ఆలోచిస్తుంటాడు. అలాంటి ఉదంతమే తాజాగా వెలుగు చూసింది.
దారుణమేమిటంటే.. ఏళ్లు తరబడి సహజీవనం చేసిన ఈ బుల్లితెర నటుడు.. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి సినిమా చూపించాడు. ఇలాంటి తరహా ఉదంతాలు సాదాసీదా వారిలో ఎక్కువగా కనిపిస్తాయి కానీ ప్రముఖల విషయంలో అంత ఎక్కువగా ఉండవు. కానీ.. ఈ ఎపిసోడ్ అందుకు మినహాయింపు.
ముంబయిలో చోటు చేసుకున్న ఈ వైనం సంచలనంగా మారింది. ఎందుకంటే.. బాధితురాలి.. బాధ్యుడు ఇద్దరూ సెలబ్రిటీలు కావటమే కారణం.బుల్లితెర నటుడు కిరణ్ రాజ్.. ముంబయికి చెందిన మోడల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఐదేళ్లు సహజీవనం చేశారు. రాజరాజేశ్వరి నగర్ లో కలిసి ఉన్న నేపథ్యంలో.. పెళ్లి చేసుకుందామని మోడల్ అడిగేసరికి మాట దాటేయటం మొదలెట్టాడు.
దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన మోడల్ ముంబయి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే మార్చి 24న ముంబయిలో ఉన్న ప్రేయసికి కిరణ్ రాజ్ ఫోన్ చేసి బెంగళూరు రావాలన్నాడు. దీంతో అతడి మాటలు నమ్మి వెళ్లిన ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెను ఒక ప్రాంతంలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశాడు.
తాను మోసపోయిన వైనాన్ని మరోసారి గుర్తించిన ఆమె.. ఎట్టకేలకు అతడి చెర నుంచి తప్పించుకొని ముంబయి వెళ్లిపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి ముంబయి పోలీసులకు ఏకరువు పెట్టగా.. నేరం జరిగింది బెంగళూరులో కాబట్టి.. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలనటంతో ఆమె మరోసారి బెంగళూరు వెళ్లారు. అక్కడి పోలీసుల్ని ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు బుల్లితెర నటుడ్ని అరెస్ట్ చేశారు.