Begin typing your search above and press return to search.
30 హత్యలు చేసినవాడు వచ్చి మన పక్కనే కూర్చుంటే!
By: Tupaki Desk | 27 Dec 2022 6:29 AM GMTబికినీ కిల్లర్.. చార్లెస్ శోభరాజ్ ఇటీవల నేపాల్ జైలు నుంచి విడుదలయిన సంగతి తెలిసిందే. 1970, 80 దశకాల్లో భారత్, థాయిలాండ్, తదితర దేశాల్లో 30కి పైగా హత్యలను శోభరాజ్ చేశాడు. ముఖ్యంగా మహిళా పర్యాటకులే లక్ష్యంగా అతడు రెచ్చిపోయాడు. తన అందంతో వారిని ఆకట్టుకుని.. ఆ తర్వాత వారిని దారుణంగా అంతమొందించి.. వారి వద్ద ఉన్న నగలు, నగదు దోచుకునేవాడు. ఎట్టకేలకు ఆయన పాపం పండి నేపాల్ లో జైలు పాలయ్యాడు. అక్కడ 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన చార్లెస్ శోభరాజ్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అతడి పెంపుడు తండ్రి దేశమైన ఫ్రాన్స్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న చార్లెస్ శోభరాజ్ విమానంలో ఫ్రాన్స్ కు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో విమానంలో శోభరాజ్ కూర్చున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. సోషల్ మీడియాను గత కొద్ది రోజులుగా కుదిపేస్తోంది. ఈ ఫొటో మీడియా పతాక శీర్షికలకు కూడా ఎక్కడం గమనార్హం.
విమానంలో చార్లెస్ శోభరాజ్ పక్కన ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. ఆయన పక్కనే కూర్చున్నవారికి ముందు అతడు ఒక సీరియల్ కిల్లర్ అని తెలిసే అవకాశమే లేదు. అందులోనూ అతడు వృద్ధుడు కావడంతో తమలాగా ఒక ప్రయాణికుడేనని భావించి ఉండొచ్చు. తమకు లానే అతడి గమ్యస్థానానికి బయలుదేరి ఉంటాడని అనుకుని ఉంటారు.
అయితే.. మీడియా చార్లెస్ శోభరాజ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం.. అతడి ఫొటోలు కోసం ఎగబడటంతో అసలు విషయం తెలిసి ఉంటుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో చార్లెస్ శోభరాజ్ విమానంలో కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ పక్కనే ఉన్న మహిళ తన పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసుకుని బిత్తరపోయి ఉంటుంది. దీంతో ఆమె బిత్తరచూపులు చూస్తూ ఆ ఫొటోలో కనిపిస్తోంది. తన పక్కన కూర్చుంది ఇంత భయంకర హంతకుడా అన్నట్టు ఆమె ముఖంలో భయం సైతం కనిపిస్తోంది.
కాగా జైలు నుంచి విడుదలయ్యాక శోభరాజ్ స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఖతార్ ఎయిర్ వేస్ లో బయలుదేరాడు. ఇలా ఖతార్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కినప్పుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ చిత్రం వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
'మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?' అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు 'నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా' అని తెలిపారు. ఒక మహిళ జీవితంలో ఇది ఒక అత్యంత భయానక సందర్భమని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.