Begin typing your search above and press return to search.

శ్రీనివాసరెడ్డి హత్యలకు - ఆ సినిమాకు సంబంధం ఏంటి.?

By:  Tupaki Desk   |   1 May 2019 7:00 AM GMT
శ్రీనివాసరెడ్డి హత్యలకు - ఆ సినిమాకు సంబంధం ఏంటి.?
X
4 ఏళ్లు - 3 హత్యలు - 2 బావులు - 1 హంతకుడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారాం మండలంలోని హాజీపూర్‌ గ్రామం వరుస హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ మధ్యే ఉంటూ ముగ్గురు మైనర్ల ఉసురు తీసిన మానవమృగం శ్రీనివాసరెడ్డి గురించి తల్చుకుని ప్రతీ ఒక్కరూ భయపడిపోతున్నారు. అభం శుభం తెలియని ఆడపిల్లల్ని అతి కిరాతకంగా రేప్ చేసి సైకో శ్రీను ఎలా చంపగలిగాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. పోలీసులు కూడా అసలు శ్రీనివాసరెడ్డి సైకోగా ఎలా మారాడు అని ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. కమల్‌హాసన్‌ హీరోగా వచ్చిన రాఘవన్‌ సినిమాకు - శ్రీనివాసరెడ్డి జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉందనే విషయం ఈ సందర్భంగా పోలీసులకు అర్థమైంది.

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన రాఘవన్‌ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో విలన్‌ ఒక మెడికో కమ్‌ సైకో. చదువుకునే రోజుల్లో పోలీస్‌ కమిషనర్‌ ప్రకాశ్‌ రాజ్‌ కూతురితో మిస్‌ బిహేవ్‌ చేస్తాడు. దీంతో.. ప్రకాష్‌ రాజ్‌ పోలీసుల్ని పురమాయిస్తాడు. పోలీసులు విలన్‌ ని అరెస్ట్‌ చేసి ఒక రాత్రంతా బట్టలు లేకుండా స్టేషన్‌ లో కూర్చోబెడతారు. తనని ఇంతలా అవమానిస్తారా అనే కోపంతో ప్రకాశ్‌ రాజ్‌ కుటుంబంపై పగబట్టి అందర్ని చంపేస్తాడు విలన్‌. అంతేకాదు.. అందమైన అమ్మాయిల్ని రేప్‌ చేసి చంపి బావిలో పడేస్తుంటాడు.

సీన్‌ కట్‌ చేస్తే రాఘవన్‌ సినిమాలో లాంటి సంఘటనే శ్రీనివాసరెడ్డి జీవితంలో కూడా జరిగింది. గతంలో.. ఒకరితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రామస్థులు శ్రీనివాసరెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో.. అప్పటినుంచి అమ్మాయిలపై కోపం పెంచుకున్న శ్రీనివాసరెడ్డి.. తనకు కన్పించిన అమ్మాయిల్ని రేప్‌ చేసి చంపి బావిలో పడేస్తున్నాడు. ఇప్పుడు శ్రావణి హత్యతో శ్రీనివాసరెడ్డి చేసిన అకృత్యాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి గతం తెలుసుకున్న పోలీసులు.. రాఘవన్‌ సినిమా సీన్లే ఇక్కడ రిపీట్‌ అయినట్లున్నాయని చర్చించుకుంటున్నారు.