Begin typing your search above and press return to search.

ఏక‌కాలంలో దెబ్బ‌ పై దెబ్బ‌.. ఊహించ‌ని చంద్ర‌బాబు...!

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:30 PM GMT
ఏక‌కాలంలో దెబ్బ‌ పై దెబ్బ‌.. ఊహించ‌ని చంద్ర‌బాబు...!
X
ఒక‌టికాదు.. రెండు కాదు.. ఏక‌కాలంలో దెబ్బ‌పై దెబ్బ‌! ఒక‌వైపు ప్ర‌జాక్షేత్రంలో పార్టీకి అనూహ్య‌మైన ప‌రాజ‌యాలు.. మ‌రోవైపు వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను టార్గెట్ చేస్తున్న అధికార ప‌క్షం. వెర‌సి.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే ఇలాంటి ప‌రిస్థితి అస్స‌లు ఊహించి ఉండ‌రేమో! అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక్క నెల రోజుల వ్య‌వ‌ధిలోనే.. చంద్ర‌బాబు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. గ‌త నెల‌లో పార్టీ నేత ప‌ట్టాభి రాం చేసిన వ్యాఖ్య‌ల ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు.. పార్టీ కేంద్ర కార్యాల‌యంపై పెద్దఎత్తున దాడి చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. మ‌రుస‌టి రోజు 36 గంట‌ల దీక్ష చేశారు.. ఈ వ‌య‌సులో ఆయ‌న పార్టీ కోసం.. పార్టీపై జ‌రిగిన దాడిని ఎలివేట్ చేయ‌డం కోసం.. దీక్ష చేప‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో పెరుగుతున్న అరాచ‌కాలు.. ప్ర‌భుత్వ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేలా కేంద్రాన్ని ఒప్పించి.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించేలా ప్ర‌య‌త్నించారు. దీనికిగాను ఆయ‌న రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిసారు. అయితే.. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు రాష్ట్ర‌ప‌తి అప్పాయింట్‌మెంట్ ల‌భించినా.. కేంద్రంలోని పెద్ద‌లైన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. నెంబ‌ర్ 2గా ఉన్న అమిత్ షాల అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌లేదు. ఇది పెద్ద అవ‌మానం. ఇప్ప‌టి వ‌ర‌కు కేరాఫ్ ఢిల్లీ అంటూ.. ఒక‌టుంది.త‌న‌కు ఏదైనా క‌ష్టం వ‌స్తే.. ఆదుకుంటుంది.. అనే భ‌రోసాను చంద్ర‌బాబు వ్య‌క్తం చేసేవారు. అయితే.. ఇప్పుడు అది కూడా పోయింది. అది జ‌రిగింది కూడా ఈ నెల రోజుల వ్య‌వ‌ధిలోనే..!

ఇక‌, ఇప్పుడు.. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో దెబ్బ‌మీద దెబ్బ త‌గిలింది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో త‌న పార్టీ మునిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం. సొంత ఇలాకాలోనే ప‌ట్టుకోల్పోతున్నామ‌నే ఆవేద‌న నుంచి తేరుకునేలోగానే.. నిండు స‌భ‌లో అధికార పార్టీ నేత‌ల నుంచి ఘోర‌మైన మాట‌లు ప‌డాల్సి రావ‌డం.. క‌న్నీరు కార్చ‌డం.. స‌భ‌కు ఇక రాను అని శ‌ప‌థం చేయ‌డం వంటివి.. చంద్ర‌బాబు 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలోనే ఒక పెద్ద మ‌లుపులుగా చెర‌గ‌ని జ్ఞాప‌కాలుగా మారిపోయాయి. ఒక‌వైపు పార్టీని న‌డిపించ‌డం.. మ‌రోవైపు అధికార‌ప‌క్షం నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డం.. ఇప్పుడు చంద్ర‌బాబుకు ఏమంత ఈజీకాద‌ని అంటున్నారు.

నిజానికి అన్న శ‌ప‌థం ప్ర‌కారం చంద్ర‌బాబు అసెంబ్లీకి వెళ్ల‌క‌పోయినా.. మున్ముందు.. అధికార ప‌క్షం ఆయ‌న‌ను కుదురుగా ఉండ‌నిచ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు పొలిటిక‌ల్ జీవితంలో ఇదో పెద్ద అగ్నీప‌రీక్షా కాల‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.