Begin typing your search above and press return to search.
బీహార్లో దారుణం: దళితులపై తీవ్రంగా దాడి: వ్యక్తి అరెస్టు
By: Tupaki Desk | 13 Dec 2021 5:01 PM ISTదళితులపై దాడులను అరికట్టేందుకు ఎన్నో చట్టాలు వస్తున్నా.. వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో మూలన వారిపై దాడులుజరుగుతూనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియా పుణ్యమాని అలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేదంటే ఇంకా ఎన్నో ఘోరాలు మనకు తెలియకుండా నే జరుగుతున్నాయనుకోవచ్చు.
దళితులపై ధూషణలు చేస్తేనే చట్టం శిక్షిస్తుంది. అలాంటిది ఓవ్యక్తి కొందరు దళితులపై అరాచకపమైన దాడులు చేశాడు. బీహారల్ లో జరిగిన ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. కొద్ది సేపట్లోనే అది వైరల్ కావడంతో దాడి చేసిన వ్యక్తిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో బల్వంతర్ సింగ్ అనే వ్యక్తి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తన ఓటమికి దళితులే కారణమంటూ ఆ సమాజంపై నిందలు వేయడమే కాకుండా ఆ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై తీవ్రంగా దాడి చేశాడు. తాను గెలిచేందుకు వారికి డబ్బులు ఇచ్చానని తెలుపుతున్నాడు.
డబ్బులు తీసుకొని ఓటు వేయలేదని ధూషిస్తూ ఆఇద్దరు వ్యక్తుల చెవులు పట్టుకొని అటూ ఇటూ తిప్పాడు. వారితో గుంజీలు తీయించాడు. వారిలో ఒకరిపై శారీరకంగా దాడి చేసి నేలపై ఉమ్మి, దానిని నాకించాడు. ముందుగా బాధిత వ్యక్తి ఒప్పుకోకపోవడంతో తలను గట్టిగా పట్టి నేలకు అదిమి మరీ నాకించాడు.
తన ఓటమికి దళితులే కారణమంటూ బల్వంతర్ సింగ్ వ్యాఖ్యలో వీడియోలో వినిపిస్తున్నారు. అయితే కొందరు ఈ వీడియోనూ షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ బల్వంతర్ సింగ్ పై తిట్ల దండకం మొదలుపెట్టారు.
కొందరు ప్రత్యక్షంగా ఈ సంఘటనపై అడగడంతో అతను మాట మార్చాడు. ‘ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అందకే వారిని ఆ విధంగా శిక్షించాను’అని అన్నాడు. పోలీసులకు వరకు ఈ వీడియో వెళ్లడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు.
మరోవైపు ఈ దారుణానికి పాల్పడ్డ బల్వంతర్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని దళిత సమాజం మండిపడుతోంది. కొందరు ట్విట్టర్ వేదికగా దళితులపై దాడులు ఇంకెన్నడు ఆగుతాయి..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. పోలీసులు నేరస్తుడిని అరెస్టు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలని అంటున్నారు.
దళితుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా అవి వారిని రక్షించడానికి ఉపయోగం లేదని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. చట్టాలు కేవలం కాగితాల్లో మాత్రమే ఉంటున్నాయని వాటి ద్వారా బాధితులకు సరైన న్యాయం జరగడం లేదంటున్నారు. దళితులపై దాడులు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అంటున్నారు. అయితే పోలీసులు బల్వంతర్ సింగ్ ను ప్రత్యేకంగా విచారించనున్నారు.