Begin typing your search above and press return to search.
డేరా బాబాకు సీరియస్...
By: Tupaki Desk | 3 Jun 2021 1:39 PM GMTడేరా బాబాగా సుపరిచితుడు అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గుర్తుండే ఉంటుంది. ప్రార్థనలు, పూజలతో సమస్యలు పరిష్కరిస్తానని ప్రకటించుకున్న ఈ బాబా ఇద్దరు యువతులమీద అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించగా 2017 నుంచి రోహ్ తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం డేరా బాబా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
రోహ్ తక్ సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన తల్లి నసీబ్ కౌర్ ను కలవడానికి 21 రోజుల పాటు పెరోల్ కోరగా ఒక రోజు మాత్రమే పెరోల్ లభించింది. పెరోల్ అనంతరం తిరిగి రోహ్ తక్ జైలులో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆరోగ్యం క్షీణించడంతో రామ్ రహీమ్‌ను రోహ్ తక్ లోని పండిట్ దీన్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐ)కు తరలించారు. ఈ ఉదయం 7 గం.ల సయమంలో పటిష్టమైన భద్రత మధ్య జైలునుంచి ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు మే 12న రక్తపోటు సమస్య కారణంగా రామ్ రహీమ్ ను ఇదే ఆస్పత్రికి తీసుకువచ్చారు.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రామ్ రహీమ్‌కు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి హెల్త్ బులిటిన్ విడుదల చేయనున్నట్లు పండిట్ దీన్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. కాగా, డేరా బాబా భక్తులు ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.