Begin typing your search above and press return to search.
బోగస్ చలానా కుంభకోణంపై సీరియస్
By: Tupaki Desk | 13 Aug 2021 1:12 PM GMTప్రభుత్వానికి రావాల్సిన ఆదాయలను వదులుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరు. ఒకవైపు సక్షేమ కార్యక్రమాల అమలకు నిధుల కొరత, మరోవైపు కరోనా వైరస్ కారణంగా తగ్గిపోయిన ప్రభుత్వ ఆదాయం జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ పెంచేస్తున్నదనే చెప్పాలి. అందుకనే ఆదాయార్జానకు ప్రభుత్వం ఎప్పటికిప్పుడు కొత్త మార్గాలను వెతుకుతునే ఉంది.
ఇలాంటి నేపధ్యంలోనే బోగస్ చలానాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కొందరు అక్రమార్కులు గండికొడుతున్నారని బయటపడింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం కొందరు అక్రమార్కుల వల్ల ప్రభుత్వానికి సుమారు రు. 7 కోట్ల ఆదాయానికి గండిపడిందట. ఇంకేముంది జగన్ ఊరుకుంటారా ? అందుకనే సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష పెట్టి అందరిపైనా సీరియస్ అయ్యారు.
అక్రమార్కుల్లో ఎంతటి వారైనా సరే గుర్తించి అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని గట్టిగా చెప్పారు. వారందరిపైనా కేసులు పెట్టి వారినుండి మొత్తం సొమ్మును రికవరీ చేయాల్సందే అని స్పష్టంగా ఆదేశించారు. అధికారులు మాట్లాడుతు అక్రమార్కుల నుండి ఇప్పటివరకు రు. 40 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. కుంభకోణం బయటపడిన గుంటూరు జిల్లాలోనే సుమారు రు. 8 లక్షలు రికవరీ చేశామన్నారు.
నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న విషయం మొదటగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయటపడింది. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్ వేర్లోని లోపాలను కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని నకిలీ చలానాలను ముద్రించుకుని తమ పనికానిచ్చేస్తున్నారు. అందుకనే సాఫ్ట్ వేర్ లోని లోపాలను సరిచేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అధికారులు చెప్పారు. మరి ప్రభుత్వం కోల్పోయిన మొత్తం ఆదాయాన్ని ఎప్పటికి రాబడుతారో ఏమో చూడాల్సిందే.