Begin typing your search above and press return to search.

సీరమ్ టీకా ధర రూ. 250 మాత్రమేనా ?

By:  Tupaki Desk   |   8 Dec 2020 5:29 PM GMT
సీరమ్ టీకా ధర రూ. 250 మాత్రమేనా ?
X
సీరమ్ సంస్ధ తయారు చేస్తున్న కరోనా వైరస్ టీకా ధర రూ. 250 మాత్రమేనా ? అంటే అవుననే అంటున్నారు. రెండు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సీరమ్ సంస్ధ తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అందుబాటులోకి తేవటానికి అత్యవసరంగా అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

టీకా పంపిణి, వాడకం తదితరాలపై కేంద్రప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవటానికి సీరమ్ సంస్ధ సీఈవో అధర్ పూనావాలా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లో వాడకంపై సీరమ్ సంస్ధతో పాటు బ్రిటన్ కు చెందిన ఫైజర్, హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మాకంపెనీలు కూడా టీకా వైరస్ ను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే.

భారత్ బయోటెక్ తో పాటు గుజరాత్, పూనాలోని మరో రెండు ఫార్మాకంపెనీలను కూడా ఈమధ్యనే ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా పరిశీలించిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇటువంటి నేపధ్యంలో మనదేశంలోని రెండు ఫార్మా కంపెనీలు తొందరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేనుండటం హ్యాపీ అనే చెప్పుకోవాలి.

ఇదే సమయంలో సీరమ్ సంస్ధ వ్యాక్సిన్ ధర రూ. 250 అయితే, భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ డెవలప్ చేస్తున్న మందు ధర ఎంతన్నది ఇంకా తెలియలేదు. అయితే ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన ధర సుమారుగా వెయ్యిరూపాయలు ఉంటుందని ప్రచారం అందరికీ తెలిసిందే. దీనికితోడు ఫైజర్ వ్యాక్సిన్ ను స్టోర్ చేయాలంటే కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రత తప్పదంటున్నారు. మరి ఇటువంటి పరిస్ధితుల్లో ధర తక్కువ, ఉష్ణోగ్రత కూడా అంతగా అవసరం లేదంటున్న సీరమ్ వ్యాక్సినే మన వాతావరణానికి సరిపోతుందని అంటున్నారు. వ్యాక్సిన్ విడుదలైతే కానీ ఏ సంగతి చెప్పలేం.