Begin typing your search above and press return to search.

జీఎస్టీ బాదుడుపై మ‌రింత స్ప‌ష్టత‌

By:  Tupaki Desk   |   5 Jun 2017 5:30 AM GMT
జీఎస్టీ బాదుడుపై మ‌రింత స్ప‌ష్టత‌
X
పన్నుల విధానంలో స‌మూలంగా మార్పులు తీసుకొచ్చే జీఎస్టీలో వివిధ వ‌స్తువులు.. వ‌స్తుసేవ‌ల విష‌యంలో ప‌న్ను బాదుడు ఎంత ఉంటుంద‌న్న విష‌యాన్ని జాబితాల రూపంలో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన జాబితాల్లో ప‌న్ను బాదుడు మీద‌నే కేంద్రం ఎక్కువ ఫోక‌స్ చేసిన విష‌యం అర్థ‌మ‌వుతుంది. నిత్యావ‌స‌రాల మీద‌.. పేద‌ల‌కు భారం కానిరీతిలో జీఎస్టీ ప‌న్నుల విధానం ఉంద‌ని చెప్పినా.. ప‌న్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ‌మంది.. సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల్ని ఏమాత్రం పొంద‌ని దిగువ‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిపై భారీ ప్ర‌భావం ప‌డుతుంద‌న్న విష‌యం తెలిసిందే.

వారు ఉప‌యోగించే వ‌స్తువులు.. వ‌స్తు సేవ‌ల‌పై ప‌న్నులు భారీగా ఉండ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మ‌రికొన్ని వ‌స్తువులు.. వ‌స్తుసేవ‌ల‌పై విధించే ప‌న్ను బాదుడు.. మ‌రికొన్నింటికి మిన‌హాయింపుల్ని ఇస్తూ కొత్త జాబితాను విడుద‌ల చేశారు. ఇందులోని వివ‌రాల్ని చూస్తే..

ప‌న్ను మిన‌హాయింపు పొందిన వ‌స్తువులు.. వ‌స్తు సేవ‌లు

+ ఖాదీ దారం

+ గాంధీటోపీ

+ జాతీయ ప‌తాకం

+ విబూది

+ రుద్రాక్ష‌లు

+ పూజాసామాగ్రి

+ చెక్క పాద‌ర‌క్ష‌లు

+ పంచామృతం

+ తుల‌సి పూస‌ల మాట‌

+ దారాలు

+ చంద‌నం (గంధం)

+ అన్ బ్రాండెడ్ తేనె

+ దీప‌పు వ‌త్తులు

+ బాధితుల కోసం రెడ్ క్రాస్ దిగుమ‌తి చేసుకునే మందులు

+ భోపాల్ గ్యాస్ లీక్ బాధితుల చికిత్స‌కు అవ‌స‌ర‌మ‌య్యే వైద్య ప‌రిక‌రాలు

+ ప్ర‌జా నిధుల‌తో న‌డిచే ప‌రిశోధ‌క సంస్థ‌లు

+ వ‌ర్సిటీలు

+ ఐఐటీలు

+ ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌

+ కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల లేబొరేట‌రీలు

+ ప్రాంతీయ కేన్స‌ర్ సెంట‌ర్లు

+ ఈ సంస్థ‌లు ఉప‌యోగించే ప‌రిశోధ‌క ప‌రిక‌రాలు

+ ధార్మిక సంస్థ‌లు పేద‌ల‌కు పంచ‌టానికి విదేశాల నుంచి తెచ్చే ఆహారం.. ఔష‌ధాలు.. వ‌స్త్రాలు.. దుప్ప‌ట్లు

+ సిల్క్‌.. జ‌న‌ప‌నార దారాలు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/