Begin typing your search above and press return to search.

బాబుకు హైకోర్టు షాకిచ్చినా ముందుకు వెళ్తార‌ట‌

By:  Tupaki Desk   |   7 Jan 2017 1:50 PM GMT
బాబుకు హైకోర్టు షాకిచ్చినా ముందుకు వెళ్తార‌ట‌
X
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ - ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా కారెం శివాజీని నిమాయకం చెల్లదని సింగిల్‌ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై చ‌ర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కారం శివాజీ సమావేశమయ్యారు. ఎస్సీ - ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ గా శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు చెప్పిన తీర్పుపై వారు చర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ గా తనను నియమించవద్దని హైకోర్టు చెప్పలేదని కారెం శివాజీ అన్నారు. హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనట్లు వివ‌రించారు. నిబంధనల ప్రకారం నియామకం జరుగలేదని కోర్టు పేర్కొందని ఈ నేప‌థ్యంలో కోర్టు ఉత్తర్వులను తాము పరిశీలిస్తున్నామని కారెం శివాజి తెలిపారు.

ఇదిలాఉండ‌గా.. కారెం శివాజి నియామ‌కం చెల్లదంటూ సింగిల్‌ జడ్జి 2016 నవంబరు 4న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు స‌మ‌ర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం - కారెం శివాజీ చేసిన అప్పీళ్లపై విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్‌ - న్యాయమూర్తి శంకరనారాయణతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. చైర్మన్‌ పదవికి ఆసక్తిగల వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించి, సెర్చ్‌ కమిటీ వేసి అభ్యర్థుల నుంచి తగిన వారిని ఆ పదవికి పారదర్శకంగా ఎంపిక చేయాల్సివుంటుందని పేర్కొంటూ కారెం శివాజీ నియామకాన్ని కొట్టివేసిన కింది కోర్టు తీర్పును స‌మ‌ర్థించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/