Begin typing your search above and press return to search.

అమ్మ కొడుతుందేమో...? తమ్ముడి భయం

By:  Tupaki Desk   |   3 Oct 2015 11:30 AM GMT
అమ్మ కొడుతుందేమో...? తమ్ముడి భయం
X
తమిళనాడులో తెలుగు సమస్యపై వివాదామేర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు పలువురు స్పందించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జయకు లేఖరాసి, స్వయంగా కలుస్తానని కూడా చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా.... సామాన్యుడి సమస్యలపై స్పందిస్తానని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొన్నామధ్య దీనిపై రెస్పాండయ్యారు. చెన్నైలు ఈ విషయంపై ఆయన దీక్ష చేస్తారన్న ప్రచారం జరిగింది. తమిళనాడు పాఠశాలల్లో తెలుగు బోధన ఆపేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తమిళనాడు దద్దరిల్లిపోయేలా ఏదో చేసేస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ ఆ జనసేన ఎలుక కలుగులోంచి బయటకు రాలేదు.... చెన్నై వెళ్లేలేదు... దీక్ష చేయనూలేదు... ''ఎలుకా... ఎలుకా... ఎందుకు బయటకు రావడం లేదు'' అంటే... ''నా బంగారు పుట్టలోంచి బయటకొస్తే అమ్మ కొట్టదా'' అంటోందట.

పవన్ ఇంకా ఏపీలోనే పూర్తిగా పొలిటికల్ గా సెటిల్ కాలేకపోతున్నారు. మోడీ ఇచ్చిన బ్యాకప్ తో ఎన్నికల సమయంలో హడావుడి చేసినా తరువాత అనాలోచిత నిర్ణయాలు, అమల్లో వైఫల్యాలతో ప్రజల్లో పలుచనవతున్నారు. తన వెనుక ఉన్న వర్గాల్లోనూ నమ్మకాన్ని కోల్పోతున్నారు. స్థిరం లేకుండా మాట్లాడడం... అది కూడా నిలుపుకోలేకపోవడం వంటి కారణాలతో పవన్ ఆటలో అరటిపండులా కనిపిస్తున్నారు. ఈ సంగతి ఆయనకు కూడా కొద్దికొద్దిగా అర్థమవుతున్నట్లే ఉంది. అందుకే ఏపీ దాటి తమిళనాడులో హడావుడి చేయడానికి ఆయన బాగా భయపడుతున్నారట. అందుకే చెన్నైలో దీక్ష చేయాలన్న నిర్ణయం నుంచి ముందే తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

చెన్నై వెళ్లి పవన్ దీక్ష చేస్తే తమిళనాడు సీఎం జయలలిత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అందడంతోనే పవన్ సైలెంటయిపోయినట్లు తెలుస్తోంది. సిని ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రానికి వెళ్లి పరాభవం పొందే కంటే సొంత రాష్ట్రంలో వాగ్దాన భంగం చేసి ప్రజలతో తిట్లు తిన్నా ఏం కాదులే అనుకుంటున్నారట పవన్. అదీ సంగతి... ఏం గబ్బర్ సింగో ఏమో... రోజురోజుకీ రబ్బర్ సింగ్ అయిపోతున్నాడు.