Begin typing your search above and press return to search.
కేటీఆర్ కూడా సెటిలరేనట
By: Tupaki Desk | 12 Jan 2016 9:28 AM GMTతన స్వభావ విరుద్ధ వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నా, పరిహాసానికి గురవుతున్నా కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తన సెటిలర్ ఆకర్షక వ్యాఖ్యలను మాత్రం ఆపడం లేదు. తాజాగా ఆయనో మరో సంచలన వ్యాఖ్య చేశారు. తాను కూడా హైదరాబాద్ లో సెటిలర్ నేనని ఆయన చెప్పొకొచ్చారు. తమ కుటుంబం సిద్ధిపేట నుంచి వచ్చి భాగ్యనరంలో స్థిరపడిందని వివరించారు. అసలు హైదరాబాద్ లో సెటిలర్ కానివారెవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. కేటీఆర్ తాను హైదరాబాదులో సెటిలరునని చెప్పుకొంటున్నా వాస్తవానికి కేసీఆర్ కుటుంబమే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన కేసీఆర్ కుటుంబం వారి ముత్తాతల సమయంలోనే తెలంగాణ వచ్చి స్థిరపడిపోయిందని గతంలో విమర్శలు వచ్చాయి. దాన్ని కేసీఆర్ - టీఆరెస్ కొట్టిపారేయడంతో చాలాకాలంగా ఆ విషయం మరుగునపడిపోయింది. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ ఆ కుటుంబం సెటిలర్లన్న విమర్శలు గుప్పించడానికి విపక్షాలకు ఆయుధం దొరికినట్లయింది. కేటీఆర్ స్పీడు వల్ల కేసీఆర్ కూడా మళ్లీ విమర్శల పాలయ్యే పరిస్థితి వచ్చిందని టీఆరెస్ నేతలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేథప్యంలో 'సెటిలర్' రాజకీయాలు ఊపందుకున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఉన్న సెటిలర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లకూ టిక్కెట్లిస్తామని అధికార టీఆర్ ఎస్ ప్రకటించింది. కేటీఆర్ కూడా ఇంతకుముందు సరదా వ్యాఖ్యలంటూనే టీఆరెస్ ను తెలుగు రాష్ట్ర సమితి చేస్తామని... తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పి సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి విపక్షాల విమర్శలను ఎదుర్కొన్నారు. టీడీపీ కూడా సెటిలర్ కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెడతామని హామీ ఇచ్చేసింది. మొత్తానికి గ్రేటర్ పీఠంపై సెటిలర్లు ఎవరిని సెటిల్ చేస్తారో తెలియదు కానీ రాజకీయమంతా మాత్రం వారి చుట్టూనే తిరుగుతోంది.