Begin typing your search above and press return to search.
భారత్ లో వైరస్ వ్యాక్సిన్ ఆవిష్కరణలో ఏడు సంస్థలు!
By: Tupaki Desk | 21 July 2020 11:45 AM ISTప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు సంస్థలు.. శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీలో భారతదేశం ముందంజలో ఉంది. ఇప్పటికే వ్యాక్సిన్ కనుగొన్నారు. వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగ దశ పూర్తయి ఫలితాలు వెలుడిన అనంతరం వెంటనే ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే భారతదేశం ఆగస్టు 15వ తేదీలోపు మందు తీసుకురావాలని ఓ లక్ష్యం విధించుకుంది. ఆ లక్ష్యంలో భాగంగా భారత ఫార్మా సంస్థలైన భారత్ బయోటిక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటిక్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ లాంటి సంస్థలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో పడ్డాయి.
ఒక వ్యాధికి.. వైరస్‌కు మందు కనిపెట్టాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. వ్యాక్సిన్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది. మొదట కనిపెట్టిన మందును జంతువులపై ప్రీ క్లినికల్ టెస్టింగ్ లు నిర్వహిస్తారు. అనంతరం ఫేజ్ 1లో కొద్దిమంది మనుషులపై పరీక్షిస్తారు. వారి ఆరోగ్యం, వైరస్ ను ఎదుర్కొనడానికి టీకా ఎలా పని చేస్తుందో అధ్యయనం చేస్తారు. ఇది విజయవంతమైతే ఫేజ్ 2కు వెళ్తారు. ఇక్కడ మరింత మందికి పరీక్షలను చేస్తారు. ఫేజ్ 3లో వేలాది మందిపై టీకాలను ప్రయోగిస్తారు. అన్ని టెస్టుల్లో విజయవంతమైతే అప్పుడు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఆ మందు మార్కెట్‌లోకి అందుబాటులో వస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఏయే సంస్థలు మందుల ఆవిష్కరణ ఏ దశలో ఉందో తెలుసుకుందాం.
Covaxin, Bharat Biotech : కొవాక్జిన్ టీకా.. ఈ మందు ప్రయోగాల దశలో ఉంది. ఇటీవల ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయిల్స్‌కు అనుమతి పొందింది. హైదరాబాద్ లో ఉన్న కంపెనీ సహకారంతో ఈ టీకా తయారుచేశారు. గతవారమే Rohtak’s Post-Graduate Institute of Medical Sciences లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
AstraZeneca, Serum Institute of India : వైరస్‌కు వ్యాక్సిన్‌ను 2020 డిసెంబర్ వరకు మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ టీకాపై ఆగస్టులో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానుంది.
ZyCoV-D, Zydus Cadila : క్లినికల్ ట్రయల్స్ ఏడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వారం కిందట మొదటి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మనుషులపై చేశారు. ట్రయల్స్ పూర్తి కావడానికి…వ్యాక్సిన్ ప్రారంభించడానికి మొత్తం 7 నెలలు పట్టవచ్చని Zydus Cadila ఛైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ తెలిపారు.
Panacea Biotec : వ్యాక్సిన్ ను రూపొందించేందుకు అమెరికాకు చెందిన రెఫానా ఇంక్ తో కలిసి ఐర్లాండ్ లో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేస్తోంది. 500 మిలియన్ మోతాదులో వైరస్‌కు వ్యాక్సిన్ తీసుకరావాలని భావిస్తోంది. 2021 ప్రారంభంలో 40 మిలియన్ మోతాదులకు పైగా డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Indian Immunologicals : నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ సంస్థ. ఈ సంస్థ వైరస్‌కు వ్యాక్సిన్ రూపొందించడానికి ఆస్ట్రేలియాకు చెందిన Griffith University తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి.
Mynvax : ఈ కంపెనీ వైరస్‌కు టీకాను రూపొందించే పనిలో తీవ్రంగా శ్రమిస్తోంది. 18 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ప్రీ - క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉంది.
Biological E : Biological E టీకా ఆవిష్కరించనుంది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉంది.