Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ లో వరల్డ్ రికార్డ్.. ఏకంగా 7 పథకాలు !

By:  Tupaki Desk   |   2 Aug 2021 7:37 AM GMT
టోక్యో ఒలంపిక్స్ లో వరల్డ్ రికార్డ్.. ఏకంగా 7 పథకాలు !
X
ఆస్ట్రేలియన్‌ ‘బంగారు చేప’ ఎమ్మా మెక్‌కియాన్‌ ఒలింపిక్స్‌ లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌ లో ఏడు పతకాలు గెలిచి ప్రపంచ రికార్డ్ తిరగరాసింది. ఆదివారం టోక్యో ఆక్వాటిక్స్‌ సెంటర్‌ లో జరిగిన మహిళల 4X 100 మీటర్ల రిలే పోటీలలో స్వర్ణం సాధించడంతో ఎమ్మా ఈ ఘనత సాధించింది. 1952లో సోవియట్‌ యూనియన్‌ జిమ్నాస్ట్‌ మారియా గోరోఖోవ్‌ మాత్రమే ఏడు పథకాలు ఈ ఫీట్‌ సాధించింది.

ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడ‌ల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మ‌ర్‌ గా ఆమె నిలిచింది. ఆదివారం జరిగిన మ‌హిళ‌ల 4×100 మీట‌ర్ల రిలే ఈవెంట్‌ లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం ద్వారా మెక్‌ కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఆమెతోపాటు కేలీ మెక్‌ కియోన్‌, చెల్సీ హాడ్జెస్‌, కేట్ క్యాంప్‌ బెల్‌ ల‌తో కూడిన ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు డిఫెండింగ్ చాంపియ‌న్ అమెరికాకు షాకిచ్చింది. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌ లో మెక్‌ కియోన్ మొత్తం మెడ‌ల్స్ సంఖ్య ఏడుకి చేరింది.

ఒకే ఒలింపిక్స్‌ లో ఇన్ని మెడ‌ల్స్ గెలిచిన మ‌రో మ‌హిళా స్విమ్మ‌ర్ లేక‌పోవ‌డం విశేషం. 27 ఏళ్ల మెక్‌ కియోన్ నాలుగు గోల్డ్ మెడ‌ల్స్‌, మూడు బ్రాంజ్ మెడ‌ల్స్‌ ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈస్ట్ జ‌ర్మ‌నీకి చెందిన క్రిస్టిన్ ఒటో (1952లో 6 మెడ‌ల్స్‌), అమెరికాకు చెందిన న‌టాలీ క‌ఫ్లిన్ (2008 ఒలింపిక్స్‌) పేరిట ఉన్న రికార్డును మెక్‌కియోన్ చెరిపేసింది.