Begin typing your search above and press return to search.
ఛత్తీస్ గఢ్ లో దారుణం..పెళ్లికి వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్ - అవమాన భారంతో ఆత్మహత్య!
By: Tupaki Desk | 9 Oct 2020 1:30 AM GMTదేశం మొత్తం ఒకవైపు మహిళలపై జరిగే అత్యాచారాలపై నిరసనలు తెలుపుతుంటే , మరోవైపు కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ దేశంలో ఎదో ఒక మూల మహిళలు అత్యాచారాలకి గురౌతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ మానవ మృగాలు రెచ్చిపోయాయి. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ రాత్రి మొత్తం బాలికను బంధించి నిందితులు తెల్లవారుజామున వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాధితురాలు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణమైన ఘటన గత జూలైలో కొండగావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరగగా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గత జూలైలో బాధిత బాలిక స్నేహితుడితో కలిసి ఓ పెళ్లికి వెళ్లింది. ఆ పెళ్లి ముగిసిన తర్వాత, ఇంటికి తిరిగి వస్తుండగా అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి , మరో ఐదుగురిని పిలిపించుకుని ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. రాత్రంతా బాలికతోనే గడిపిన నిందుతులు తెల్లవారుజామున ఆమెను వదిలేశారు. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఏం చేయాలో తోచక మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ తర్వాత నిందితులను శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు.
దీనితో, తన కూతురుకు న్యాయం జరుగలేదని మనోవేదన భరించలేక అక్టోబర్ 6న ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో స్థానిక మీడియా సంస్థలన్నీ జరిగిన ఘోరం గురించి తెలుసుకుని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుమందిని అరెస్ట్ చేసారు , మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అయితే , పోలీసులు మాత్రం అప్పుడు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.