Begin typing your search above and press return to search.
సీడ్ కేపిటల్ లో ఏడు మెట్రో స్టేషన్లు
By: Tupaki Desk | 18 Aug 2015 12:45 PM GMTనవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మెట్రో రైలు పరుగులు తీయడం ఖాయమైపోయింది. అమరావతి నుంచి బయలుదేరే మెట్రో రైలు ప్రకాశం బ్యారేజీని దాటుకుని విజయవాడతో కనకదుర్గమ్మ గుడి దగ్గర కలవనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో మొత్తం ఏడు మెట్రో స్టేషన్లను నిర్మించాలని భావిస్తున్నారు.
అమరావతిలో 12 కిలోమీటర్ల మేర మెట్రోను డిజైన్ చేసి సింగపూర్.. 1.2 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్ ను డిజైన్ చేసింది. అమరావతిలో అత్యధిక ట్రాఫిక్ సీడ్ కేపిటల్ లోనే ఉంటుందని అంచనా వేసిన సింగపూర్.. దానికి అనుగుణంగానే బహుళ ప్రజా రవాణా వ్యవస్థను ప్రతిపాదించింది. మెట్రో రైలుకు సంబంధించి సీడ్ కేపిటల్ లో రెండు మార్గాలను ప్రతిపాదించింది. సీడ్ ఏరియా నుంచి ఏర్పాటు చేయనున్న రెండు మార్గాల నుంచి ఎక్కువ సాంధ్రత కలిగిన కారిడార్ ను ప్రతిపాదిస్తున్నారు. అమరావతిలోకి మెట్రో రైలు ప్రవేశించే చోట ఒకటి.. బయటకు వెళ్లేచోట మరొకటి ప్రధాన రైల్వే స్టేషన్లు ఉంటాయి. మధ్యలో ఏడు స్టేషన్లను ప్రతిపాదించింది.
మెట్రోతోపాటు 15 కిలోమీటర్ల పొడవునా బీఆర్ టీ రోడ్డు మార్గాన్ని ప్రతిపాదించింది. ప్రతి అర కిలోమీటరుకు ఒక బస్టాపు ఉండనుంది. వీటికితోడు వాటర్ టాక్సీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ప్రజా రవాణా మరింత సులభం కానుంది.