Begin typing your search above and press return to search.
రూ.710కోట్ల లెక్కను చెప్పలేని 7 పార్టీలు!
By: Tupaki Desk | 31 May 2018 5:44 AM GMTచట్టంలోని లొసుగుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో రాజకీయ పార్టీలు చూపించే స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. వ్యవస్థల్ని నడిపించేదే రాజకీయ పార్టీలు. ఎవరు అధికారంలో ఉన్నా.. తమతో పాటు తమ తోటి వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవటంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంటాయి.
వ్యవస్థలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే ప్రభుత్వాలు.. వాటిని నడిపించే రాజకీయ పార్టీలకు ఇబ్బంది రాని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక షాపువాడు తాను అమ్మే ప్రతి వస్తువుకు బిల్లు ఇవ్వాలన్న రూల్ ఉంది. అదే టైంలో ఒక రాజకీయ పార్టీకి రూ.20వేల లోపు విరాళాలకు సంబంధించిన లెక్కలు చూపించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఒక్క రూల్ చాలదా రాజకీయ పార్టీలు చెలరేగిపోవటానికి.
రూ.20వేల లోపు వచ్చిన విరాళాలకు సంబంధించి ఏడు ప్రముఖ రాజకీయ పార్టీలు వెల్లడించిన వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. 2016-17లో వచ్చిన విరాళాల్లో రూ.710.8కోట్లకు సంబంధించిన లెక్కలు తమకు తెలీవని పార్టీలు చెబుతున్నారు. రూ.20వేలు అంతకంటే ఎక్కువ విరాళాల కేటగిరిలో అన్ని పార్టీలకు కలిపి రూ.589.38 కోట్లు రాగా.. బీజేపీ వాటానే రూ.532.27 కోట్లు కావటం గమనార్హం.
రూ.20వేల లోపు విరాళాలకు సంబంధించి జాతీయ పార్టీలకు రూ.258.98 కోట్లు వచ్చినట్లుగా లెక్కలు తేలాయి. అయితే.. తమకు వచ్చిన విరాళాలకు సంబంధించి రూ.710 కోట్ల వివరాలు తమకు తెలీవని.. ఆవి ఎవరు ఇచ్చారో తమకు తెలీదని చెబుతున్నాయి. అధికారికంగానే ఇన్నేసి వందల కోట్ల రూపాయిల లెక్కలు చెప్పలేని రాజకీయ పార్టీలపై ఎలాంటి చర్యలు ఎందుకు ఉండవు? చర్యలు దాకా ఎందుకు.. అలా పరిస్థితి చోటు చేసుకోకుండా ఉండేలా ముందస్తు ఏర్పాట్లను ఇప్పటికైనా ఎందుకు తీసుకోరంటారు?