Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు?
By: Tupaki Desk | 26 May 2020 7:30 AM GMTఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయా? ప్రతిపక్ష టీడీపీ పునాదులు కదలబోతున్నాయా? ఇన్నాళ్లు పక్కరాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు దిమ్మదిరిగే షాక్ ను టీడీపీ ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ధ్రవపరుస్తున్నాయి వైసీపీ సన్నిహిత వర్గాలు. తాజాగా వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారట.. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లోనే టీడీపీలో పెను సంక్షోభం చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ నుంచి వైసీపీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడానికి రంగం సిద్ధమైనట్లు రాజకీయా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈరోజు ఒంగోలులోని మంత్రి బాలినేని నివాసంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావులు భేటి కావడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. వీరితోపాటు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్టు వార్తలు లీక్ అవుతున్నాయి.
ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని.. వారంతా తమ కోరికలు - వైసీపీలో ప్రాధాన్యంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఏపీ రాజకీయాలే షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కనుక చేరితే అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయి టీడీపీ మొత్తం పార్టీ వైసీపీలో విలీనం అవుతుంది. ఇదే జరిగితే టీడీపీ కి అంతకంటే అవమానం మరోటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.