Begin typing your search above and press return to search.
ఏడుమందికి పాజిటివ్: కటింగ్ చేయించుకుంటే సోకిన కరోనా..
By: Tupaki Desk | 26 April 2020 12:31 PM GMTకరోనా వైరస్ కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొందరు ఉల్లంఘిస్తున్నారు. ఆ ఉల్లంఘనకు పాల్పడిన వారికి కరోనా వైరస్ సోకుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో అదే విధంగా ఒకరికి కరోనా వైరస్ సోకగా.. ఆరుగురికి కూడా సోకే అవకాశం ఉంది. సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించినా యథేచ్ఛగా కొనసాగుతుండడంతో వారు కరోనా బారిన పడే అవకాశం పొంచి ఉంది.
మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇండోర్ నుంచి స్థానికంగా ఉన్న సెలూన్ లో హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అనంతరం రెండు రోజులకు అతడు అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది.
అయితే అతడు హెయిర్ కట్ చేసుకున్న అదే సెలూన్ లో అదే వారంలో మరో ఆరుగురు వ్యక్తులు కటింగ్ చేయించుకున్నారు. దీంతో వారందరిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల్లో కూడా వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యువకులను క్వారెంటైన్ కు తరలించారు. ఒకేసారి ఏడుగురికి కరోనా రావడంతో ప్రస్తుతం వారి గ్రామాన్ని క్వారంటైన్ లోకి తరలించారు. అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు.
--