Begin typing your search above and press return to search.

మెరుపుదాడుల్లో భార‌త్ ప్ర‌యోగించిన ఏడు అద్భుతాలు!

By:  Tupaki Desk   |   26 Feb 2019 10:25 AM GMT
మెరుపుదాడుల్లో భార‌త్ ప్ర‌యోగించిన ఏడు అద్భుతాలు!
X
ప్ర‌త్య‌ర్థిని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ‌కు విల‌విల‌లాడిపోవాలి. కూసాలు క‌దిలిపోవాలి. మ‌ళ్లే లేచే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు. ఒక‌వేళ చేయాల‌న్నా శ‌క్తియుక్తులు స‌రిపోకూడ‌దు. మొత్తం నెట్ వ‌ర్క్ ను ధ్వంసం చేసేయ‌టం.. భార‌త్ తో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్న భ‌యం క‌లిగేలా చేయాలి.

ఇలా త‌మ ముందున్న టాస్క్ ల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. భార‌త స‌ర్కార్. పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడికి బ‌దులు తీర్చుకునేందుకు జైషే మ‌హ్మ‌ద్ శిబిరాల‌పై ప్ర‌యోగించిన ఏడు అద్భుత ఆయుధాల వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఏడు అద్భుతాల‌తోనే ప్ర‌త్య‌ర్థి తేరుకునే లోపు.. ల‌క్ష్యాన్ని పూర్తి చేసి వైమానిక ద‌ళం వెన‌క్కి వ‌చ్చేశాయి. తాజా మెరుపుదాడుల సంద‌ర్భంగా ప్ర‌యోగించిన ఏడు అద్భుతాలు ఏమంటే..

1. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు: బహుముఖ సేవలు అందించగల ఈ ఫ్రాన్స్ యుద్ధ విమానాల్ని ద‌సో ఏవియేషన్ సంస్థ నిర్మించింది. 1980లో రాఫెల్ యుద్ధ విమానాల కంటే ముందే వీటిని కొనుగోలు చేశారు.

2. జీబీయూ-12 పేవ్‌వే లేజర్ గైడెడ్ బాంబు: అమెరికాలో తయారైన బాంబుల కిట్ ఇది.. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది.

3. మాత్రా మ్యాజిక్ క్లోజ్ యుద్ధ క్షిపణి: ఫ్రాన్స్‌ లో తయారైన యుద్ధ క్షిపణి. దాడుల వేళ పాక్ వైమానిక దళాన్ని నిరోధించే స‌త్తా దీని సొంతం.

4. లైటెనింగ్ పాడ్: లేజర్ కాంతితో లక్ష్యాలను గుర్తిస్తుంది. బాంబులను కచ్చితంగా ప్రయోగించేందుకు వీలు క‌ల్పించే టార్గెటింగ్ పాడ్ వ్యవస్థ దీని బ‌లం.

5. నేత్ర జెట్: ప్రత్యర్థి దాడులను ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేసే యుద్ధ విమానం. బటిండాలోని డీఆర్‌ డీవో దీన్ని అభివృద్ధి చేసింది. గాల్లోనే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థగా పని చేస్తూ, లక్ష్యాల వైపు యుద్ధ విమానాలకు వేగంగా మార్గ నిర్దేశం చేస్తుంది.

6. ఇల్యూషన్ 78ఎం: సుదీర్ఘ అవసరాల కోసం గాల్లో ఎగురుతూనే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని స‌మ‌కూర్చుస్తుంది.

7.హెరోన్ డ్రోన్: నియంత్రణ రేఖ పొడవునా రహస్య వైమానిక కేంద్రం నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు నిఘా పెడుతుంది.