Begin typing your search above and press return to search.
బాబు సుపరిపాలనలో ప్రతిపక్షంలో చేరికలు
By: Tupaki Desk | 27 Dec 2017 6:28 AM GMTతనది సుపరిపాలన అని, మరో ముప్పై ఏళ్లపాటు విపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని టీడీపీ రథసారథి - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసుకుంటున్న ప్రకటనల్లో నిజం ఎంత ఉందో ఇప్పటివరకు ఎన్నో ఉదాహరణలు నిరూపించాయి. తాజాగా మరోమారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్షం వైసీపీలో పలువురు నేతలు చేరడం ద్వారా బాబు సుపరిపాలనలో ప్రతిపక్షంలో చేరికలు అని రుజువు అయింది. గిద్దలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో పార్టీలోకి మరోమారు చేరికల పర్వం కొనసాగింది.
రాచర్ల మండలం గుడిమెట్ల పంచాయతీ రామాపురం పాలెం పల్లె నిద్ర - రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే పథకాలను గిద్దలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ ఐవీ రెడ్డి వివరించడంతో పార్టీకి చెందిన నేతలు పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన అబ్బయ్య - రోశయ్య ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిద్దలూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషిచేయనున్నట్లు వివరించారు. దీంతోపాటుగా రాబోయే ఎన్నికల్లో ఐవీరెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాలెం వాసులతో పాటుగా పార్టీ నాయకులు - కార్యకర్తలు పాల్గొన్నారు.