Begin typing your search above and press return to search.

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం .. దీపావళి కి ముందే..

By:  Tupaki Desk   |   1 Nov 2021 7:30 AM GMT
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం .. దీపావళి కి ముందే..
X
దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 302గా నమోదైందని పేర్కొన్నది. రాబోయే రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్‌ పేర్కొంది. ఈ నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం అంచనా వేసింది. 4వ తేదీ వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయిలో ఉండి, 5-6 తేదీల్లో గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది.

నవంబర్ 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంటుందని సఫర్ అంచనా వేసింది. నవంబర్ 4 వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి పడిపోవచ్చునని భారత వాతావరణ విభాగం ఆదివారమే అంచనా వేసింది. నవంబర్ 5 నుంచి 6 తేదీల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని పలు వాయుకాలుష్య ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ తెలిపింది. PM2.5 అనేది తీవ్ర కాలుష్యకారిణిగా IMD పేర్కొంది.

ప్రభుత్వ ఏజెన్సీల ప్రకారం.. AQI అనేది.. 0 నుంచి 5 మధ్య నమోదైతే.. అది గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్టు.. అదే 51-100 మధ్య ఉంటే పర్వాలేదు.. 101-200 మధ్య ఉంటే మోస్తరుగా ఉన్నట్టు.. 201-300 మధ్య గాలి నాణ్యత నమోదైతే చాలా పేలవంగా ఉందని, 301-400 మధ్య ఉంటే మరి అధ్వాన్నంగా ఉందని, ఇక చివరిగా 401-500 మధ్య ప్రమాదకర స్థాయిలో ఉందని గుర్తిస్తారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని పలు వాయుకాలుష్య ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ తెలిపింది.