Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో చిన్నారి నరబలి కలకలం!
By: Tupaki Desk | 2 Feb 2018 7:21 AM GMTహైదరాబాద్ మహానగరంలో రోజురోజుకీ క్రైమ్ రేట్ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ యువతిని దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో వేసి నడిరోడ్డుపై పడేసిన ఘటన.....ఓ గర్భిణిని అతికిరాతకంగా హత్య చేసిన ఘటన...మరువక ముందే మరో చిన్నారి హత్యోదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారిని గుర్తు తెలియన దుండగులు పాశవికంగా హత్య చేసి తల....మొండాన్ని వేరు చేశారు. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో బుధవారం జరిగిన ఈ దారుణమైన ఘటన ....గురువారం వెలుగులోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన రీతిలో హత్యకు గురైన చిన్నారి ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్ లోని చిలుకానగర్ లో రాజశేఖర్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి డాబాపై గురువారం ఉదయం చిన్నారి తలను అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. మొండెం లేని చిన్నారి తలను చూసి భయాందోళనలకు గురైన రాజశేఖర్....వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్నారి హత్య వార్త తెలిసిన జనం తండోపతండాలుగా రావడంతో భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తల - మొండెం వేరవడం....చిన్నారి చెవి - దవడపై గాయాలుండడం....బుధవారం నాడు పౌర్ణమి - సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో నరబలి కోసమే అభం శుభం తెలియని చిన్నారిని పాశవికంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, చనిపోయిన చిన్నారి....ఆడపిల్ల - మగపిల్లాడా అన్న విషయంపై సందిగ్దత ఏర్పడింది.
చిన్నారి మొండెం కోసం చుట్టుపక్కల ప్రాంతాలు - డ్రైనేజీలు - శ్మశాన వాటికల్లో పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు జాగిలాలు...రాజశేఖర్ ఇంటి ఎదురుగా ఉన్న నరహరి అనే వ్యక్తి ఇంటి వద్దకు తిరిగి రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. అక్కడ ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ జాగిలాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇళ్లలోని వ్యక్తులు - మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో చిన్నారి మిస్సింగ్ కేసులు కూడా ఏమీ నమోదు కాకపోవడంతో.....చిన్నారి సంబంధీకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు తెలిపారు.