Begin typing your search above and press return to search.

ఫోకస్: గ్రామాల్లో సెక్స్ పరిజ్ఞానం పెరిగిందట!

By:  Tupaki Desk   |   27 Jun 2019 11:03 AM GMT
ఫోకస్: గ్రామాల్లో సెక్స్ పరిజ్ఞానం పెరిగిందట!
X
సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇండియన్స్ ఎందుకు వెనకడుగు వేస్తారు? ఎందుకు ఆ విషయంలో ఓపెన్ గా ఉండరు? నిజానికి ఈ విషయంలో మొదటినుంచి భారతీయులు చాలా ఆధునికంగా ఉండేవారు. మిగతా ప్రపంచం అంతా సెక్స్ విషయంలో ఎబీసిడీలు నేర్చుకునే టైం లోనే ప్రపంచానికి కామసూత్ర అందించిన నేల ఇది. అయితే పలు కారణాల వల్ల మనం వెనకబడి పోయాం. అది డిస్కస్ చేస్తే పెద్ద డిబేట్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. హిపోక్రసీ.. బిడియం.. తప్పుడు అభిప్రాయాలతో రతి అనే పదం ఉచ్చరిస్తే తప్పు అనే దశకు వెళ్ళిపోయాం!

డాక్టర్. సమరం లాంటి శృంగార ఉద్యమకారులు 'స్వాతి' పుణ్యమా అని ఒక జెనరేషన్ పాఠకులకు సెక్స్ ఎడ్యుకేషన్ అందించారు. అయితే అప్పట్లో ఇంటర్నెట్.. ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అదే సెక్సువల్ ఎన్ సైక్లో పీడియా. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సమరంలా మారిపోయారు. ఇంతకీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. రీసెంట్ గా గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న సెక్స్ అభిరుచుల మీద ఒక స్వచ్చంద సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఇప్పుడు మీరు వెంటనే ఆ సంస్థ పేరు.. అడ్రెస్.. డీటెయిల్స్ ఇవ్వండి.. ఇలాంటి బూతు సర్వేలు చేసిన వారి సంగతి తేలుస్తాం అనకండి. ఇంకా సర్వే పబ్లిష్ కాలేదు. త్వరలోనే పబ్లిష్ అవుతుంది కాబట్టి ఆ వివరాలు మేం వెల్లడించడం లేదు.

ఇంతాకీ ఆ సర్వేలో ఏముందయ్యా అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు.. 24X7 ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సెక్స్ పట్ల విజ్ఞానం గతంలో కంటే ఎక్కువయిందట. అయినా చేపకు ఈత నేర్పాలా? మనిషికి సెక్స్ నేర్పాలా అని కొందరు చచ్చు పుచ్చు ప్రశ్నలు వేయవచ్చు కానీ ఒక బైక్ అప్పుడే నేర్చుకున్న వాడు డ్రైవ్ చేసే తీరుకు.. ఒక మెకానిక్ డ్రైవ్ చేసే తీరుకు ఎంత తేడా ఉంటుందో చెప్పండి? అలానే సెక్స్ పరిజ్ఞానం ఉన్నవారికి 'ఆ.. ఓ పని అయిపోయింది' అని మమ అనిపించే వారికి చా...లా తేడా ఉంటుంది.

అయితే ఈ సర్వేలో మగవారి కంటే మహిళలకు.. యువతులకు సెక్స్ పరిజ్ఞానం విపరీతంగా పెరిగిందని తేలిందట. ఫోర్ ప్లే గురించి అవగాహన.. ఆర్గాజమ్(తెలుగులో భావప్రాప్తి) గురించి ఇప్పుడు ఎక్కువ మందికి తెలుసట. గతంలో 50% పైగా గ్రామీణ మహిళలకు అసలు భావప్రాప్తి అంటే ఏంటో తెలియదట. అంటే అంత మెకానికల్ గా పని కానిచ్చేవారు పాపం. ఇప్పుడు అలాంటి వాటి పట్ల వారికి సంపూర్ణ అవగాహన ఉందట.

అంతే కాదు.. ఒకే నాటు భంగిమ కాకుండా వివిధ భంగిమలు ప్రయత్నించడం.. ఫ్రెంచ్ కిస్సు నుండి స్పైడర్ మ్యాన్ కిస్సు వరకూ అన్నీ ట్రై చేస్తున్నారట. సంప్రదాయవాదులు మండిపడినా సరే కొన్ని నిజాలు కూడా చెప్పుకోవాలి కదా. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్.. మలైకా-అర్జున్ కపూర్ తరహా వ్యవహారాలు కూడా గతంలో కంటే ఎక్కువయ్యాయట. గ్రామీణ యువతులు.. మహిళలు శృంగారంలో కొత్తదనం కోరుకుంటున్నారట. అలాంటి కొత్తదనం అందించే వారి వెంట పడుతున్నారట. సెక్స్ పరంగా గ్రామీణ ముఖ చిత్రం మాత్రం టెక్నాలజీ పుణ్యమా అని పూర్తిగా మారిందని సర్వేలో తేలిందంట. ఈ లెక్కన మన సినిమాల్లో చూపించినట్టు అన్నీ 'శతమానం భవతి'..'అమ్మమ్మగారిల్లు' లాంటి షుగర్ కోటింగ్ పల్లెలు కావన్నమాట!