Begin typing your search above and press return to search.

"సెక్స్ చాటింగ్ చేస్తుండు.. నీ ప్రియుడు జట్టులో ఉంటాడు": బాబర్ ఆజామ్

By:  Tupaki Desk   |   17 Jan 2023 9:03 AM GMT
సెక్స్ చాటింగ్ చేస్తుండు.. నీ ప్రియుడు జట్టులో ఉంటాడు: బాబర్ ఆజామ్
X
టెస్టుల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓటమి.. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ లో పరాజయం.. తెలివితక్కువవాడంటూ నిందలు.. కెప్టెన్సీకి పనికిరాడంటూ విమర్శలు.. ఇవి చాలదన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. వ్యక్తిగత విషయాల్లో ఎంత క్రమశిక్షణతో ఉండాలో చాటేలా అతడి గురించిన తాజా విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్న వయసులోనే పాకిస్థాన్ లాంటి జట్టుకు కెప్టెన్ అయి, ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చుకున్న బాబర్ ఆజాం లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నాడు. ఓసారి ఇప్పటికే అలాంటి ఆరోపణలు వచ్చినా విషయం తేలకపోవడంతో బయటపడ్డ అతడు తాజాగా పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఏం జరిగింది..?పాక్ కెప్టెన్ బాబర్ జట్టులోని సహచర క్రికెటర్‌ ప్రేయసికి బాబర్‌ లైంగిక సందేశాలు పంపించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాబర్‌ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సహా ఆ సందేశాల తాలూకు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. దీంతో బాబర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల రీత్యా క్రికెట్‌ వర్గాల్లో కలకలం మొదలైంది.

సహచర క్రికెటర్‌ ప్రేయసితోనే సంభాషణ జరిపినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.సెక్స్ చాటింగ్ చేస్తుండు..తాను సెక్స్ చాటింగ్ చేసిన యువతితో బాబర్ జట్టుకు సంబంధించిన విషయం పంచుకోవడమే సంచలనంగా మారింది. ''నువ్వు నాతో సెక్స్‌ చాటింగ్‌ చేస్తుంటే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటకు వెళ్లడు'' అంటూ ఆ యువతికి అతడు హామీ ఇవ్వడం దుమారం రేపుతోంది.

వాస్తవంగా ఇలానే జరిగి ఉంటే బాబర్ ను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే.. జట్టులో స్థానం గురించి బయటి వ్యక్తితో అలా మాట్లాడాడం, అదికూడా సహచరుడి ప్రేయసితో సంభాషించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాగా, బాబర్ పై వస్తున్న కథనాలన్నీ దుష్ప్రచారం అని, ఆ ఫొటోలు మార్ఫింగ్‌ చేసినవని బాబర్‌ అభిమానులు అంటున్నారు. అయితే మరికొందరు బాబర్‌పై విమర్శలు చేశారు.

ఇలాంటివి అతడికి అలవాటేనని వ్యాఖ్యలు చేస్తున్నారు.సంతోషంగా ఉండేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు..'నువ్వు ఏం చేశావనేది నీకు తెలుసనుకుంటున్నా. మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియదా? అసలు రంగును చూపిస్తున్నందుకు నన్ను చాలామంది విమర్శిస్తారు.కానీ, అతడి చెత్త ప్రవర్తన బహిర్గతమవుతోంది. తప్పకుండా నిజాలను బయటపెడతా' అంటూ ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. బాబర్ పై రెండేళ్ల కిందట కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వివాహం చేసుకొంటానని చెప్పి, గర్భవతిని చేశాడని 2020లో బాబర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

కాగా, తనపై ఇంత పెద్దఎత్తున దుమారం రేగుతున్నా బాబర్ బయటపడలేదు. 'సంతోషంగా ఉండేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు'' అంటూ ట్వీట్ చేసి సరిపెట్టాడు. చర్యలుంటాయా? ప్రపంచంలోనే టాప్-5 బ్యాట్స్ మెన్ లో బాబర్ ఒకడు. పాకిస్థాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ అతడే. చాలా తక్కువ జట్లకే ఇలా మూడు ఫార్మాట్లకు ఒకడే కెప్టెన్ ఉన్నాడు. అంతేగాక పాకిస్థాన్ బ్యాటింగ్ మూల స్తంభం బాబర్. మొహమ్మద్ రిజ్వాన్ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ తోడుగా బాబర్ పాక్ ను చాలా బలంగా నిర్మిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అతడిపై ఎంత ఆరోపణలు వచ్చినా జట్టు నుంచి తొలగించడం వంటి పెద్ద నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం. మూడేళ్ల కిందటి ఆరోపణల్లానే తాజా వివాదం కూడా కొద్ది రోజులకు సద్దుమణగడం ఖాయంగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.