Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిపోయి.. దైవ కార్యమంటూ బుకాయిస్తున్న నిందితుడు..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:28 AM GMT
అడ్డంగా దొరికిపోయి.. దైవ కార్యమంటూ బుకాయిస్తున్న నిందితుడు..!
X
బాలికలను అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక నిందితుడు పోలీసుల విచారణలో తాను చేసే పని దైవ కార్యమనంటూ సమర్ధించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 20మంది భార్యలు కలిగిన ఈ నిందితుడు అత్యధిక మంది మైనర్లను పెళ్లాడమే కాకుండా తన వింత వాదనతో పోలీసులను సైతం కన్ఫూజ్ చేస్తున్నాడు.

పోలీసులు అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసి అమెరికా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అరిజోనా యూటా సరిహద్దు ప్రాంతంలో శామ్యూల్ బేట్ మాన్(46) నివసిస్తున్నాడు. ఇతడికి ఏకంగా 20 మంది భార్యలు ఉండగా వీరిలో అత్యధిక మంది మైనర్లే ఉన్నారు.

శామ్యూల్ బేట్ మాన్ 'ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆప్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ల్యాటరీ డే సెయింట్స్' మాజీ సభ్యుడు కూడా. 130 ఏళ్ళ కిందటి దాకా ఈ చర్చి బోధనల్లో బాహు భారత్వం ఒక వారసత్వమని బోధించేవారు. అయితే 1890లో దీనిని రద్దు చేశారు. కాగా శామ్యూల్ మాత్రం తనను తాను ఓ ప్రవక్తగా చెప్పుకొని అనుచరులను ఏర్పాటు చేసుకొని వారందరికీ నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలోనే తన అనుచరుల భార్యలు.. పిల్లలను సైతం అతడు తన భార్యలుగా మార్చుకున్నాడు. కాగా గత ఆగస్టులో కొందరు బాలికలను అక్రమంగా రవాణా చేస్తూ శామ్యూల్ బేట్ మాన్ అమెరికా ఫెడరల్ పోలీసులకు చిక్కాడు. పోలీసులు తమదైన శైలిలో ఇతడిని విచారించగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేవుడి స్ఫూర్తినే వారికి మేము ఆ బాలికలకు అందిస్తున్నామని.. నేను.. మా అనుచరులు ఆ అమ్మాయిలతో చేస్తున్న సెక్స్ దేవుని ఆజ్ఞను పూర్తి చేయడమేనని వెల్లడించాడు. అనంతరం శ్యామూల్ ఆధీనంలో ఉన్న బాలికలను పోలీసులు విచారించారు. అయితే వారంతా ఫోరెన్సిక్ ఇంటర్వ్యూల్లో అతడికి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడకపోవడం విశేషం.

శ్యామూల్ భార్యలుగా ఉన్న వారే ఆ బాలికలను ప్రభావితం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా బాలికలను అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన నిందితుడు అది దైవ కార్యమేనంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ కేసులో కోర్టు అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచిచూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.