Begin typing your search above and press return to search.
బయటకు క్లినిక్.. లోపల మాత్రం సెక్స్ దందా.. నడిపేది ఎవరంటే?
By: Tupaki Desk | 4 March 2020 4:10 AM GMTఅదో క్లినిక్ అనుకున్నోళ్లంతా ఇప్పుడు అవాక్కవుతున్నారు. లోపల డాక్టర్లు.. నర్సులు.. అప్పుడప్పుడు వచ్చే వారంతా పేషంట్లుగా ఫీలైన వారికి అసలు నిజం బయటకు రావటం తో విస్తు పోతున్నారు. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందాను నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్న వైనం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరం లోని బర్కాహేది ప్రాంతం లో నడుపుతున్నది హాస్పిటల్ కాదని.. ఆ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనం బయటకు వచ్చింది.
మరో సంచలన అంశం ఏమంటే.. ఈ క్లినిక్ నిర్వాహకుడు మధ్యప్రదేశ్ టీఎంసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిదిగా చెప్పుకుంటున్నారు. ఈ దందాకు సంబంధించి పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికారపార్టీకి చెందిన నేత సెక్స్ దందాను నిర్వహిస్తున్న వైనం విస్తు పోయేలా చేస్తుంది.
నిజంగానే అతడు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడా? అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి. అయితే.. అతడి వద్ద ఉన్న విజిటింగ్ కార్డులు.. ఇంటి ముందున్న నేమ్ బోర్డు మాత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఇతని విషయం పై టీఎంసీ స్పందిస్తే కానీ అసలు విషయం కొలిక్కి రాదంటున్నారు.
మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఈ సెక్స్ రాకెట్ లో కీలకంగా భావిస్తున్న 40 ఏళ్ల గాయత్రి తనను తాను వైద్యురాలిగా చెబుతున్నారు.ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్లను పరిశీలిస్తే తప్పించి.. ఆమె మాటలు ఎంతమేర నిజమన్నది తేలుతుందని చెబుతున్నారు. ఒకవేళ.. టీఎంసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడే సెక్స్ రాకెట్ కు కీలకమై.. సదరు మహిళ వైద్యురాలు అయితే మాత్రం ఈ ఉదంతం మరింత సంచలనం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. నిర్వాహకులే ఇంత హైప్రొఫైల్ అయితే.. విటుల మాటేమిటి? అన్నదిప్పుడు కొత్త సందేహాలకు తావిస్తోంది.