Begin typing your search above and press return to search.
సెక్స్ దందా.. అమ్మాయికో రేట్ కార్డ్
By: Tupaki Desk | 2 Oct 2019 8:28 AM GMTఢిల్లీ కేంద్రంగా మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న వ్యభిచార దందాలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పైకి మాత్రం మసాజ్ సెంటర్ల లాగా కనిపించే పలు కేంద్రాల్లో విభిన్నమైన పద్ధతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తుండడం విస్తుగొలుపుతోంది. ఈ దందా వ్యవహారంలోని కఠిన వాస్తవాలు చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ తాజాగా ఢిల్లీలోని వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు అల్టీమేటం జారీ చేసింది.
మహిళా కమిషన్ ఆదేశాలతో ఇప్పటివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఆగమేఘాల మీద దాడులు మొదలు పెట్టారు. ఇందులో పెద్ద ఎత్తున స్పాలల్లోని సెక్స్ రాకెట్ దందాలు బయటపడ్డాయి. మహిళా కమిషన్ జరిపిన ఆకస్మిక దాడుల్లో సైతం భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. మసాజ్ సెంటర్లలో కండోమ్ లతోపాటు అమ్మాయిల అశ్లీల ఫొటోలతో ఉన్న రేట్ కార్డులు లభించడంతో మహిళ కమిషన్ షాక్ అయ్యింది. అమ్మాయికో రేట్ ఫిక్స్ చేసి ఉంది. దీనిపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి వివరణ ఇవ్వాలని ఢిల్లీ మునిసిపల్ కమిషనర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఉదాసీనతపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఇక ఢిల్లీలో వ్యభిచార దందా లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు.
ఢిల్లీకి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మహిళా కమిషన్ రంగంలోకి దిగి గతంలో బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్ లో నలుగురు యువతులను వ్యభిచార కూపం నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా ఈ దాడులు చేసి పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ ల గుట్టు రట్టు చేశారు. పట్టుబడ్డ మహిళలకు పునరావాసం - ఉద్యోగ ఉపాధి చూపించడానికి మహిళా కమిషనర్ రెడీ అయ్యింది.