Begin typing your search above and press return to search.
సెక్సు వర్కర్ కుమార్తె కి ఆ వర్సిటీలో సీటు!!
By: Tupaki Desk | 8 Jun 2017 10:54 AM GMTపడుపు వృత్తిలో నిండా కూరుకుపోయిన తల్లి కడుపున పుట్టిన ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది.. 99 శాతం ఆమె కూడా అదే వృత్తి చేపట్టాల్సిన పరిస్థితి. ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా అటువైపే నెడుతుంది సమాజం. కానీ.. ముంబయిలోని ఓ సెక్సు వర్కర్ కుమార్తె మాత్రం ఆ రొంపికి దూరంగా ఉంటూ మంచి చదువులు చదివి ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ యూనివర్సిటీలో సీటు సంపాదించింది.. సమాజంతో పాటు తల్లి కూడా తానున్న రొంపిలోకే దించాలని ఎన్ని ప్రయత్నాలు సాగించినా వాటికి తలొగ్గక తాను అనుకున్నది సాధించిన ఆ యువతి పేరు అశ్విని.
అశ్విని తల్లి ముంబైలో ఓ వేశ్య. తల్లి పెట్టే వేధింపులను అశ్విని భరించలేకపోయేది. చివరకు ఓ రోజు ఇంటి నుంచి పారిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో హాస్టళ్లో చేరింది. జీవితమంటే నిత్యం భయమే అనుకునే స్థాయి నుంచి ఇతరులకు ధైర్యమిచ్చే స్థాయికి ఎదిగింది. క్యాన్సర్ బాధిత పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. చాలామంది దళిత ప్రజలను చైతన్యం చేసే బాధ్యత తీసుకుంది. ఆ క్రమంలో దేశంలోని పలు నగరాల్లో పర్యటించి ఫోటోగ్రఫీ - థియేటర్ ఆర్ట్స్ - ఎన్జీవోల్లో వాలంటీర్ గా పనిచేస్తూ అనుభవం గడించింది.
న్యూయార్క్ వర్సిటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. స్కాలర్ షిప్ ఇచ్చి మరీ అశ్వినిని చదివిస్తామని వర్సిటీ ముందుకొచ్చింది. కానీ వాళ్లిచ్చే స్కాలర్ షిప్ ట్యూషన్ ఫీజులకే సరిపోతుంది. హాస్టల్ ఫీజు - తిండి వ్యక్తిగత ఖర్చులన్ని ఎలా? అన్న ప్రశ్న తలెత్తింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజ్ అనే సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ వారు తమ అధికారిక ఫేస్ బుక్ పేజీపై అశ్విని జీవితం గురించి రాశారు. దీంతో కొన్ని వేల మంది అశ్వినికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలా అక్షరాలా రూ.11,08,080 సమకూరాయి. దీంతో అశ్విని కల నెరవేరింది. న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రవేశానికి ఆమె ఇప్పుడు వెళ్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/