Begin typing your search above and press return to search.
సెక్స్ వర్కర్ల పొలిటికల్ పంచ్
By: Tupaki Desk | 31 March 2016 4:39 AM GMTరాజకీయ పార్టీలు హామీలు ఇవ్వటం వాటిని మర్చిపోవటం రివాజే. ఇలా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవటంపై పశ్చిమ బెంగాల్ కు చెందిన సెక్స్ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమయం చూసుకొని తమ గళాన్ని విప్పిన సెక్స్ వర్కర్లు.. రాజకీయ పార్టీలన్నీ హామీలు ఇవ్వటం.. వాటిని అమలు చేయకపోవటం అలవాటుగా మారిందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
పశ్చిమబెంగాల్ లోని 1.5లక్షల మంది సెక్స్ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. సెక్స్ వర్కర్ల వృత్తిని చట్టబద్ధం చేయటం.. కార్మిక చట్టాల్ని వర్తించేలా చేయటం.. వృద్ధులకు పింఛన్ల సౌకర్యం ఇవ్వటం లాంటి తమ డిమాండ్లపై స్పందించాలంటూ రాజకీయ పార్టీలన్నింటికి లేఖలు రాస్తామని అఖిల భారత సెక్స్ వర్కర్ల నెట్ వర్క్ కు అధ్యక్షురాలిగా ఉన్న భారతీ డే చెబుతున్నారు. మరి.. వారి డిమాండ్ల విషయంలో రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.