Begin typing your search above and press return to search.
కేరళ సీఎం కెమేరా కంటికి చిక్కారా?
By: Tupaki Desk | 3 Dec 2015 4:37 AM GMTరాజకీయ నాయకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. అవినీతి రాజకీయ నాయకుల వ్యవహారాల్ని కెమేరా కంటితో పట్టేయటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. తాజాగా ఆ జాబితాలో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ చేరినట్లుగా చెబుతున్నారు. కేరళలో జరిగిన సౌర విద్యత్తు కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు బిజు రాధాకృష్ణన్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడా రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తన భాగస్వామి అయిన ఒక మహిళ కేరళ సీఎంతో మాట్లాడిన వీడియోదృశ్యాలు తన దగ్గర ఉన్నాయంటూ చెప్పటం రాజకీయ వర్గాల్లోకలకలం రేపుతోంది.
సదరు వీడియోలో ఏముందో తెలియదు కానీ.. తన వద్ద బలమైన సాక్ష్యం ఉందంటూ బిజు చేస్తున్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. విపక్షాలు సీఎంపై విరుచుకుపడుతున్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. నిందితుడైన వ్యక్తి ముఖ్యమంత్రికి సంబంధించిన వీడియో ఉందన్న వెంటనే.. ఈ రచ్చ ఏమిటని? నిజంగా వీడియో ఉంటే బయటపెట్టొచ్చు కదా అని అధికారపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రికి సంబంధించిన వీడియో ఉందని చెబుతున్నప్పటికీ.. దాన్ని విడుదల చేయకుండా.. అవసరమైతే వీడియో విడుదల చేస్తానని చెప్పటం పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఇంతకీ.. కేరళ సీఎం కెమేరా కంటికి చిక్కారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.