Begin typing your search above and press return to search.
రాసలీలల గవర్నర్ ఆరాచకం ఎంతంటే..
By: Tupaki Desk | 28 Jan 2017 6:59 AM GMT‘‘రాజ్ భవన్ ను అమ్మాయిల క్లబ్ గా మార్చేశారు.. ఆయనతో పడలేకపోతున్నాం. అమ్మాయిలు నేరుగా గవర్నర్ రూమ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక మావల్ల కాదు బాబోయ్’’ అంటూ మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ పై ఆరోపణలు వెల్లవెత్తటమే కాదు.. అయ్యగారి రాసలీలలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయంపై పలు కథనాలు వచ్చి సంచలనంగా మారింది. చివరకు అయ్యగారి మీద వచ్చిన విమర్శలు.. ఆరోపణలు స్థాయికి మించటం తో ఆయనకు అండగా ఉండే వారు సైతం ముఖం చాటేయటమే కాదు.. వేటు వేయకపోతే లేనిపోని ఇబ్బందులనేవరకూ విషయం వెళ్లింది.
దీంతో.. ఆయన్ను పదవికి రాజీనామా చేయాలన్న ఆదేశాలు వచ్చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసిన షణ్ముగనాథన్.. వెళుతూ వెళుతూ తీసుకున్న నిర్ణయాలు బయటకు వచ్చి తాజా సంచలనంగా మారాయి. రాసలీలల ఆరోపణలతో పాటు.. తన పీఏగా ఉన్న ఒక మహిళకు పీఆర్వోగా ప్రమోషన్ ఇచ్చిన వైనం బయటకు వచ్చింది. అంతేకాదు.. రాజ్ భవన్ కు అవసరమైన సిబ్బంది నియామకాల సందర్భంగా షణ్ముగనాథన్ ఓవరాక్షన్ ఓ స్థాయిలో ఉందన్నమాట వినిపిస్తోంది. సాధారణంగా సీనియర్ అధికారులు ఇంటర్వ్యూచేయటం ద్వారా అపాయింట్ మెంట్ ప్రక్రియలు మొదలవుతాయి.
కానీ.. రాసలీలల గవర్నర్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉండేదని చెబుతున్నారు. సీనియర్ అధికారుల ఇంటర్వ్యూల తర్వాత ‘వన్ టు వన్’ ఇంటర్వ్యూలు చేయటం ఆసక్తికరంగా మారింది. తన వద్ద పీఏగా పని చేసిన మహిళకు రూ.6500 జీతం నుంచి రూ.12700 వరకూ ఉండగా.. ప్రమోషన్ మీద పీఆర్వోగా చేశాక ఆమె జీతం రూ.30వేలుగా డిసైడ్ చేయటం గమనార్హం. ఇలా.. వన్ టు వన్ ఇంటర్వ్యూల పేరుతో మహిళల పట్ల గవర్నర్ వైఖరి ఆయన రాజీనామా తర్వాత కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/