Begin typing your search above and press return to search.
పోలీస్ కస్టడీలో లైంగిక వేధింపులు.. ఆ ప్రముఖ నటి ఆరోపణ
By: Tupaki Desk | 2 July 2022 3:28 AM GMTఎన్సీపీ అధినేత శరత్ పవార్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యి జైలు పాలైన మరాఠీ నటి కేతకి చితాలే సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై భౌతిక దాడి చేశారని..వేధింపులకు గురిచేయడంతోపాటు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని.. లైంగిక వేధింపులకు గురిచేశారని కేతకీ ఆరోపించారు.
తాజాగా పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం కేతకీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైలు పాలు చేశారు. లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా కొట్టారు అని ఆమె వాపోయారు.ఓ ఫేస్ బుక్ పోస్ట్ కు సంబంధించి గత నెలలో అరెస్ట్ అయిన కేతకీ చితాలేకు థానే కోర్టు జూన్ 22న బెయిల్ మంజూరు చేసింది.
శరద్ పవార్ ప్రతిష్టను దిగజార్చేలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంపై ఈ ఏడాది మే 14న ఆమెను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. చితాలే చేసిన పోస్ట్ రాజకీయ పార్టీల మధ్య సంవాదానికి దారితీయవచ్చని ఫిర్యాదుదారు స్వప్నిల్ నెట్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేతకీపై మహారాష్ట్రలో 22 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. కేతకీపై మే 20న మరో కేసు నమోదవగా ఆ కేసులోనూ జూన్ 16న ఆమెకు బెయిల్ లభించింది. రూ.20వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చారు. కేతకీ థానే సెంట్రల్ జైలు నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరుఫు న్యాయవాది పేర్కొన్నారు.
తనను చట్టవిరుద్ధంగా జైలు పాలు చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకీ చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు.