Begin typing your search above and press return to search.
తమిళనాట లేడీ ఐపీఎస్ కు టార్చర్..తెలంగాణలో విచారణ
By: Tupaki Desk | 28 Aug 2019 4:25 PM GMTమహిళలకు లైంగిక వేధింపులకు దిగే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. అలాంటిది అలాంటి గురుతర బాధ్యతలు ఉన్న ఓ ఐపీఎస్ అధికారే స్వయంగా లైంగిక వేధింపులకు తెగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా కండకావరంతో సదరు ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురైన మహిళ కూడా ఐపీఎస్ అదికారే అయితే... పరిస్థితి మరింత ఘోరమే కదా. తమిళనాట బరి తెగించిన ఓ ఐపీఎస్ అధికారి తన కింద పనిచేస్తున్నమహిళా ఐపీఎస్ అధికారి మీదే లైంగిక వేధింపులకు దిగారు. ఎంతైనా మహిళా ఐపీఎస్ అంటే కాస్తంత ధైర్యంతో కూడుకున్న వారే ఉంటారు కదా. అందుకే... సదరు వేధింపుల రాయుడిపై ఆ లేడీ ఐపీఎస్ ఏకంగా పెద్ద పోరాటానికే తెర తీశారు.
తొలుత పోలీసు శాఖలోని అంతర్గత విచారణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లేడీ ఐపీఎస్... ఏకంగా మద్రాస్ హైకోర్టునే ఆశ్రయించారు. దీంతో వేధింపుల ఐపీఎస్ అధికారిపై సీబీసీఐడీ విచారణ జరిగినా... ఎందుకనో విచారణపై బాధితురాలికి నమ్మకం కలగలేదు. ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారి విచారణను ప్రభావితం చేస్తున్నారన్న భావనకు వచ్చిన బాధితురాలు... కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. ఈ అభ్యర్థనకు కూడా సరేనన్న కోర్టు... ఈ కేసును విచారించి ఆరు నెలల్లోగా నివేదికను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - డీజీపీలకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కలకలం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఐపీఎస్ కు ఎంపికై తమిళనాడు కేడర్ పోస్టు దక్కించుకున్న మహిళా ఐపీఎస్ అదికారి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అదే రాష్ట్ర కేడర్ కు చెందిన ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి మురుగన్... తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగానికి జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో తన కింద పనిచేసేందుకు వచ్చిన మహిళా ఐపీఎస్ పై కన్నేశాడు. సూటిపోటి మాటలతో పాటు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. కొంతకాలం పాటు అతడి వేధింపులను కాస్తంత లైట్ గానే తీసుకున్న బాధితురాలు... మురుగన్ వేధింపులు ఎక్కువవడంతో తిరగబడింది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా హైకోర్టునూ ఆశ్రయించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న విచారణను కూడా మురుగన్ ప్రభావితం చేస్తున్నాడన్న అనుమానంతో ఏకంగా తన కేసును తెలంగాణకు బదిలీ చేయాలంటూ కోర్టును కోరి విజయం సాధించింది. తెలంగాణ పోలీసుల విచారణలో అయినా సదరు లేడీ ఐపీఎస్ కు న్యాయం జరగాలని, ఆమెను వేధింపులకు గురి చేసిన మురుగన్ కఠిన శిక్ష పడాలన్న వాదన వ్యక్తమవుతోంది.