Begin typing your search above and press return to search.

లవ్ ఎఫైర్ - సెక్స్ పై హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   1 March 2020 1:24 PM IST
లవ్ ఎఫైర్ - సెక్స్ పై హైకోర్టు సంచలన తీర్పు
X
వివాహేతర సంబంధం.. అక్రమ సంబంధం.. పేరుకు ఏదైనా సరే.. యువతిని నమ్మించి నీకు అది చేస్తా ఇది చేస్తానని మభ్యపెట్టి ఆమెతో ఎఫైర్ పెట్టుకునే మగరాయుళ్లకు ఇక కష్టాలు తప్పవు.  వివాహేతర సంబంధాలపై ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నమ్మించి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకే పరిగణలోకి వస్తుందని న్యాయ స్థానం తేల్చిచెప్పింది.

ప్రేమ పేరుతో నమ్మించి వాడుకొని అనక ముఖం చాటేసే ఆడవారు/మగాళ్లకు ఈ తీర్పు చెంపపెట్టులా మారింది. తాజాగా ఓ యువతి తనను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి అత్యాచారం చేశాడని ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె పేర్కొంది.

అయితే యువకుడు మాత్రం యువతి అంగీకారంతోనే లైంగిక సంబంధం పెట్టుకున్నానని.. తాను నిర్ధోషినని వాదించాడు. ప్రేమ పేరుతో సెక్స్ చేసుకొని విడిపోయిన ఈ ఇద్దరి కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాడుకొని వదిలేశాడని యువతి వేసిన పిటీషన్ పై వాదనలు విన్న ముంబై హైకోర్టు తప్పుడు వాగ్ధానాలతో స్త్రీలను నమ్మించి మోసం చేస్తే అత్యాచారం కిందకే వస్తుందంటూ తీర్పును ఇచ్చింది.