Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు కారు గుర్తుని తొలగించండి
By: Tupaki Desk | 24 Jan 2019 4:32 PM GMTఎన్నికల్లో అభ్యర్థి ఎంత ప్రచారం చేసినా అంతిమంగా.. ఓటు వేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అభ్యర్థిని కాదు. అతనికి కేటాయించిన గుర్తుని. పార్టీ గుర్తు అనగానే మనకు టీడీపీకి సైకిల్ - టీఆర్ ఎస్ కు కారు - కాంగ్రెస్ కు చెయ్యి గుర్తుకువస్తాయి. అయితే.. ఇప్పుడు టీఆర్ ఎస్ కు ఉన్న కారు గుర్తుని తొలగించాలని.. గద్వాల్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన సమాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి అబ్దుల్ మహ్మద్ తెలంగాణ ఈసీ రజత్ కుమార్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి కారు గుర్తుని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే.. అప్పుడు కూడా చాలా మంది అభ్యర్థులు తనలాగే నష్టపోతారని అంటున్నారు అబ్దుల్.
మొన్నటి ఎన్నికల్లో గద్వాల్ నుంచి అబ్దుల్ పోటీచేశారు. ఎలక్షన్ కమిషన్ ఆయనకు ట్రక్కు గుర్తుకు కేటాయించింది. దీంతో కారు - ట్రక్కు చూడ్డానికి రెండూ ఒకేలా ఉండడంతో.. తనకు ఓట్లు వేయాల్సిన వాళ్లంతా కారు గుర్తుకు ఓటు వేశారని ఆయన వాపోతున్నారు. లేదంటే తాను కచ్చితంగా గెలిచేవాడినని చెప్తున్నారు. మరోవైపు టీఆర్ ఎస్ వాదన కూడా మరోలా ఉంది. అసలు ఇలాంటి ట్రక్కు గుర్తుల వల్లే తమకు సీట్లు తగ్గాయని లేదంటే.. వందకు పైగా సీట్లు వచ్చేవని చెప్తోంది. మరి అబ్దుల్ వినతిపత్రాన్ని ఎన్నికల కమిషన్ ఏ మేర సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి.